తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున నట వారసుడిగా జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాదు.. ఫ్యాన్స్ తో మంచి ఫాలోయింగ్ లో ఉంటాడు. తనకు సంతోషాన్ని కలిగించే ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా థాంక్యూ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు చైతూ. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు థంక్యూ చెబుతూ పోస్ట్ పెట్టాడు.
మనం జీవితంలో థ్యాంక్యూ అనేది చాలా కొద్ది మందికి మనస్ఫూర్తిగా చెబుతుంటాం. నేను నటిస్తున్న థ్యాంక్యూ మూవీ ఇదే ఆలోచనలకు కారణం అని చెప్పొచ్చు. ఈ మూవీ చేస్తున్నంత సేపు నేను ఎన్నో నేర్చుకున్నాను. ఒకదశలో ఈమూవీ జర్నీ నా జీవితాన్ని కదిలించింది అంటూ రాసుకొస్తూ.. నా ఈ పోస్ట్ నా జీవితలో అత్యంత ముఖ్యమైన వారికి అంకితం చేస్తున్నాను. వారికి థ్యాంక్యూ చెప్పడానికి ఎప్పటికీ సరిపోదనే చెప్పాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల చిత్రాలను పంచుకోవడం మీ అందరికీ ఇష్టం ఉంటుంది కదూ.. #themagicwordisthankyou అనే ట్యాగ్‌తో తమ జీవితంలో ఎవరికీ థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారో ఫొటోలను షేర్ చేసి ట్యాగ్ చేయమని కోరాడు.
నాగ చైతన్య తల్లి లక్ష్మి ఫోటోను షేర్ చేస్తూ ‘ నా జీవితంలో అన్ని రకాలుగా సపోర్ట్ చేసి నాపై అంతులేని ప్రేమ, అభిమానం చూపించిన అమ్మకు థ్యాంక్యూ’ అని పోస్ట్ చేశాడు. అలాగే నాగార్జున ఫోటో షేర్ చేస్తూ ‘నాకు మంచి స్నేహితుడిగా ఉంటూ.. వెన్నంటి సపోర్ట్ చేసిన నాన్నకు థ్యాంక్స్, సొసైటీలో మనిషిగా ఎలా ఉండాలో గౌరవ మర్యాదలు ఎలా పొందాలో చెప్పినందకు థ్యాంక్స్’ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్ట్ వైరల్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్ పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘థ్యాంక్యూ’జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు -శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.