తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున నట వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించిన అఖిల్ అక్కినేని కి సరైన హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది కూడా డిజాస్టర్ అయ్యింది.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అతి కొద్దిమంది మాత్రమే హీరోలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కెరీర్ బాగానే సాగుతున్నా.. అఖిల్ కి ఇప్పటికీ మంచి హిట్ కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ఆదరణ లభించలేదు. తాజాగా ఈ మూవీ పై మొదటిసారి స్పందించారు అఖిల్ అక్కినేని. వివరాల్లోకి వెళితే..
‘అఖిల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ఆ మద్య వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త పరవాలేదు అనిపించుకుంది. ఈ మద్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ అయ్యింది. తాజాగా ఈ మూవీ పరాజయంపై మొదటిసారిగా స్పందించారు అఖిల్. అన్నుకున్న విధంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందు మెప్పించలేకపోయింది.. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మాద్యమంలో నోట్ విడుదల చేశాడు. ఈ నోట్ లో తన శ్రేయస్సు కోరుకునే అభిమానులను ఉద్దేశించి రాసాడు.
ఏజెంట్ చిత్ర బృందానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన వారికి కృతజ్ఞతలు. సినిమా గురించి ఎంతో కష్టపడినప్పటికీ దురృష్టవశాత్తు మేము అనుకున్న స్థాయికి స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయాం. మూవీ మొదలు పెట్టిన్పటి నుంచి నాకు ఎంతో అండగా నిలిచిన నిర్మాత అనీల్ కు కృతజ్ఞతలు. మమ్ముల్ని నమ్మి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇకపోతే అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించే ప్రేమాభిమానల వల్లే నేను కష్టపడి పనిచేస్తున్న. నాపై నమ్మకం పెట్టుకున్న పెట్టుకున్నవారి కోసం నేను మరింత దృఢంగా సిద్దమై వస్తాను’ అని నోట్ లో పేర్కొన్నాడు. అయితే ఈ నోట్ లో ఎక్కడ కూడా డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఇక ఏజేంట్ మూవీ యాక్షన్, స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర నిర్మించారు. ఈ మూవీలో మొదటిసారిగా అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. ఇందుకోసం ఆయన ఆరు నెలల పాటు ఎంతగానో శ్రమించినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపాడు. భారీ అంచనాల మద్య గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కానీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో నిర్మాత అనీల్ సోషల్ మాద్యం వేధికగా.. ‘ఏజెంట్’ ఫలితం విషయంలో పూర్తి బాధ్యత తమదే అని.. సరైన స్క్రిప్ట్ తో వెళ్లకపోవటమే అని అన్నాడు. ఇదిలా ఉంటే.. అక్కినేని హీరోలు నటించిన మూవీస్ ఈ ఏడాది ఒక్కటీ సక్సెస్ కాలేదు. నాగార్జున నటించిన ‘ఘోస్ట్ ’, అఖిల్ నటించిన ‘ఏజెంట్’, నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సైతం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
— Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023