తెలుగులో డెబ్యూ మూవీతోనే స్టార్ అయిపోయిన మృణాల్ ఠాకూర్.. ఒకే ఒక్క స్టేట్ మెంట్ వలన దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. తాజాగా ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ.. తన ఆవేదన వ్యక్తం చేసింది.
సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అనేది ఎప్పుడు వచ్చినా దాన్ని ఎక్కువకాలం నిలుపుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయిపోతుంటారు. ఇంకొంతమందికి ఎక్కువ టైమ్ పట్టవచ్చు.. అసలు స్టార్డమ్ వస్తుందో లేదో చెప్పలేం. కానీ.. తెలుగులో డెబ్యూ మూవీతోనే స్టార్ అయిపోయిన ఓ హీరోయిన్.. ఒకే ఒక్క స్టేట్ మెంట్ వలన దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. గతేడాది తెలుగులో ‘సీతారామం’ సినిమాతో డెబ్యూ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమా ఇండస్ట్రీని ఎలా షేక్ చేసిందో తెలిసిందే.
చాలాకాలం తర్వాత ఓ ప్యూర్ లవ్ స్టోరీని చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో నటించిన మృణాల్ పై మనసు పారేసుకున్నారు. చక్కని చీరకట్టు, అందమైన నవ్వు.. అద్భుతమైన ఎమోషన్స్ అన్నీ కలిపి మృణాల్ కి తెలుగులో ది బెస్ట్ ఎంట్రీ లభించింది. దీంతో ఎప్పుడెప్పుడు సెకండ్ మూవీ అనౌన్స్ చేస్తుందా? అని చూస్తున్న టైమ్ లో హీరో నానితో సెకండ్ మూవీ అనౌన్స్ చేసింది. అయితే.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా లైనప్ చేస్తోంది ఈ భామ. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు భర్తగా రాబోయే వ్యక్తిలో అందం చూడనని మంచివాడు అయితే చాలని చెప్పింది. దీంతో అబ్బో.. మృణాల్ వ్యక్తిత్వం కూడా అందానికి ప్రాధాన్యత ఇచ్చే రకం కాదని అందరూ ఎంతో ప్రశంసించారు.
అంతవరకు బాగానే ఉంది. రీసెంట్ గా మరో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫేమస్ కపిల్ శర్మ షోలో పాల్గొంది ముద్దుగుమ్మ. ఈ షోలో కాబోయేవాడు ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు.. ‘తనకు అందమైన వాడు కావాలి’ అని చెప్పింది. అరే అదేంటి.. మొన్నే కదా అందం అక్కర్లేదు అంది.. ఇంతలోనే మళ్లీ ఇలా మాట మార్చిందేంటీ? అని షాకైన నెటిజన్స్.. దారుణంగా ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మృణాల్ వట్టి అబద్దాలకోరు.. మాటలమారి అని, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మాటలు మార్చేస్తుందని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు. దీంతో తాజాగా ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ.. తన ఆవేదన వ్యక్తం చేసింది మృణాల్.
ట్రోల్స్ పై మృణాల్ స్పందిస్తూ.. “నాకప్పుడు అలా అనిపించి అది చెప్పాను. ఇప్పుడిలా అనిపించి ఇది చెప్పాను. అందరిలాగే నాకు కూడా అభిప్రాయాలు మారుతుంటాయి. సెలబ్రిటీ హోదా వచ్చినప్పటికీ అందరూ నార్మల్ మనుషులే. పర్సనల్ గా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ విషయాన్నీ మర్చిపోయి ప్రవర్తించడం కరెక్ట్ కాద” అని చెప్పుకొచ్చింది. దీంతో మృణాల్ మాటలకు కొంతమంది సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృణాల్ ఠాకూర్ కి తెలుగులో మొదటి సినిమా సీతారామంతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మరి ఈసారి నాని సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి! ఇక మృణాల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.