నటనతోనే కాదు గ్లామర్‌తోనూ యువతకు కిర్రెక్కిస్తోంది ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె నెట్టింట పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ‘బాట్లా హౌజ్’, ‘సూపర్ 30’, ‘తూఫాన్’, ‘జెర్సీ’ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు టెలివిజన్ నటిగా క్రేజ్ తెచ్చుకున్నారు మృణాల్. అయితే ఎన్ని సీరియళ్లు, సినిమాల్లో నటించినా రాని పేరు ఒక్క చిత్రంతో ఆమె సంపాదించారు. అదే ‘సీతారామం’. టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘సీతారామం’లో సీతగా తెలుగు అభిమానుల మనసుల్లో మర్చిపోలేని స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ మూవీతో ఆమెకు ఇక్కడ ఓవర్‌నైట్ క్రేజ్ వచ్చేసింది.
ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’లో సీత పాత్రలో మృణాల్ చక్కగా ఒదిగిపోయారు. ఆ క్యారెక్టర్లో ఆమెను తప్ప ఇంకెవర్నీ ఊహించలేనంతగా అద్భతుమైన నటనను కనబర్చారు. ఈ సినిమాలో చీరలో కనిపిస్తూ తెలుగుదనంతోనూ అలరించారామె. అలాంటి మృణాల్ ఈమధ్య హాట్ అండ్ బోల్డ్ ఫొటో షూట్లతో అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నారు. కొన్నాళ్లుగా గోవా వెకేషన్లో ఉన్న మృణాల్ ఠాకూర్.. అక్కడ పలు ఫొటో షోట్లతో ఫ్యాన్స్ గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను ఆమె షేక్ చేస్తున్నారు.
తాజాగా మరిన్ని బికినీ ఫొటోలను మృణాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. అవి చూసిన కొందరు అభిమానులు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన ‘సెల్ఫీ’ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిశారు మృణాల్. ఇప్పుడు ఆమె తెలుగులో ఒక మూవీ చేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మృణాల్ ఇంకెందరి మనసులను దోచుకుంటారో చూడాలి.
Stay tuned ❤️ #MrunalThakur pic.twitter.com/xTGIEAfKAg
— Mrunal Thakur🦋 (@MrunalStann) April 6, 2023