రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు విలక్షణ శైలీలో సినిమాలు తీస్తూ.. గుర్తింపు తెచ్చుకున్న RGV వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తనకు ఎలాంటి ఎమోషన్స్ లేవని ప్రకటించుకోవడమే కాక.. దేని గురించి అయినా.. సరే ఒపెన్, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు ఆర్జీవీ. ఇక ఈయనలో మరో క్వాలిటీ ఏంటంటే.. సాధారణంగా ఫ్రెండ్‌షిప్‌డే, హ్యాపీ న్యూఇయర్ వంటి విషెస్ చెప్పడానికి దూరంగా ఊంటారు. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు. మదర్స్ డే రోజున తల్లితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి మరి.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ తన తల్లికి శుభాకాంక్షలు తెలిపాడు ఆర్జీవీ. ఈయన ఇలా విషెస్ చెప్పడమే ఆశ్చర్యం అంటే.. ఇక్కడ కూడా తన మార్క్ చూపెట్టి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఆర్జీవీ. ఈ పోస్ట్‌లో కూడా చేతిలో గ్లాస్ పట్టుకుని దర్శనమిచ్చాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RGV, రామ్ సత్యనారాయణ “గే” లు: నిర్మాత నట్టికుమార్!
‘హ్యాపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి’.. అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ చేతిలో గ్లాస్ పట్టుకొని కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు కూడా విషెస్ చెబుతున్నారా.. అంతే ఆర్జీవీ ఎప్పటికీ అర్థం కాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి ఎవరేమన్నా పట్టించుకోని రామ్‌గోపాల్‌వర్మ..తల్లి విషయంలో మాత్రం ఎప్పుడూ మంచి కుమారుడిగానే మసులుకున్నారు. గతంలో కూడా నా ఇష్టం పేరుతో పుస్తకం రాసిన ఆర్జీవీ తన మాతృమూర్తి చేతుల మీదుగానే దాన్ని ఆవిష్కరించారు. ఆర్జీవీ పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Happy Mother’s Day Mom, I am not as good as a son but u are more than good as a mother 💐💐🙏 pic.twitter.com/uZ7E9ngeMy
— Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2022
ఇది కూడా చదవండి: Ram Gopal Varma : KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని వీరప్పన్ తో పోలుస్తూ RGV వ్యాఖ్యలు!