ఈ ప్రపంచంలో నిన్ను నిస్వార్థంగా.. నీ నుంచి ఏం ఆశించకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి తల్లి. పిల్లలపై అమ్మ చూపించే ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు, కావ్యాలు సరిపోవు. బిడ్డ ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తల్లికి మాత్రం ఇంకా చిన్న పిల్లాడే. బిడ్డల కోసం తల్లి అనునిత్యం పరితపిస్తుంది. నిత్యం పిల్లల కోసం తపిస్తు.. వారికి ఆకాశమంత ప్రేమను పంచే.. తల్లికి కృతజ్ఞతలు తెలపడానికి మదర్స్ డేని జరుపుకుంటున్నాం. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు మదర్స్ డే రోజున తల్లికి శుభాకాంక్షలు తెలిపి.. అమ్మకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన వీడియోని షేర్ చేశారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: రివ్యూలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
మదర్స్ డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియోలో మెగా బ్రదర్స్ అంతా ఒకే చోట చేరారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి అందరు ఒక్క చోట చేరి తల్లిని కలుసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు చిరంజీవి. ‘అమ్మలందరికీ అభివందనములు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక మెగాబ్రదర్స్‌నందరిని ఇలా ఒకే చోట చూడటంతో అభిమానులు ఫుల్లు ఖుషీ అవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022
ఇది కూడా చదవండి: 103 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా శ్రీదేవితో డ్యాన్స్ చేశా.. ఎందుకంటే: చిరంజీవి