సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నప్పుడే దూకుడు ప్రదర్శించాలి. హీరో, దర్శకుడు, హీరోయిన్ ఇలా ఎవరైనా కావొచ్చు.. అత్యుత్తమ దశలో ఉన్నపుడే వారి డ్రీమ్స్ తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము. ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.
చిత్రసీమలో హాస్యబ్రహ్మగా పేరొందిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం. దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. పన్నెండు వందలకు పైగా సినిమాలలో నటించి.. గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కెరీర్ లో ఎన్నో వందల వెరైటీ క్యారెక్టర్స్ పోషించిన బ్రహ్మానందం.. తెలుగు మనిషి కావడం తెలుగువారంతా ఎంతో గర్వించదగిన విషయం. తాజాగా రంగమార్తాండ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ బ్రహ్మానందం క్యారెక్టర్ చూసి ఎమోషనల్ అవుతున్నారు
టాలీవుడ్ సీనియర్ నటి పాకీజా దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు చెరో లక్ష రూపాయాలు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకీజాకు చేయూత అందించాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
ఓ పేషంట్‌కు నాలుగు యూనిట్ల రక్తం అవసరం అయింది. సిటీ అంతా ఆ రక్తం కోసం వెతికారు. కానీ, ఎక్కడా దొరకలేదు. దీంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకు సంప్రదించారు. హుటాహుటిన స్పందించిన బ్లడ్ బ్యాంకు అవసరమైన మేర రక్తాన్ని అందజేసింది.
కుడిచేతితో చేసిన దానం.. ఎడమచేతికి తెలియకూడదు అన్న సామెతను మెగాస్టార్ చిరంజీవి అక్షరాల పాటిస్తున్నారు. అందుకే ప్రముఖ నటుడు వైద్యానికి రూ. 40 సాయం చేసి ఎక్కడా తెలీకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా సాయం పొందిన నటుడు పొన్నంబలం చెప్పుకొచ్చాడు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. నాయకులు ప్రతిష్టను దిగజార్చడానికి ఎలాంటి ప్రచారానికి అయినా వెనకాడటం లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి తప్పుడు వార్తలకు వెంటనే చెక్ పెట్టగలుగుతున్నాం. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ తప్పుడు వీడియో ఇలానే ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..
95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాలలో ఇండియన్ సాంగ్ 'నాటు నాటు' చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ళ కల.. ఇండియన్ సాంగ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ గా రికార్డు సెట్ చేయాలని.. ఆ కలను ఈరోజు సాకారం చేసింది నాటు నాటు సాంగ్.. ఇది మన ఇండియన్ సాంగ్.. ఇదే మన ఒరిజినల్ సాంగ్. అవును.. 2023 ఆస్కార్స్ లో నాటు నాటు ఇండియాకి మర్చిపోలేని అనుభూతిని అందించింది.
చిరంజీవి ఒక లెజెండ్. బలగం సినిమా హిట్ అయితే తన సినిమా హిట్ అయినంతగా మురిసిపోతున్నారు. వేణుని, బలగం సినిమా నటీనటులను అభినందించకుండా ఉండలేకపోయారు చిరంజీవి. బలగం సినిమా హిట్ అయితే చిరంజీవికి ఎందుకింత ఆనందం?
ఇండస్ట్రీలో దర్శకులు చిన్న హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా.. స్టార్ హీరోతో ఒక్క హిట్ కొడితే చాలు.. ఆ డైరెక్టర్ ఒక్కసారిగా టాప్ లిస్టులోకి చేరిపోతారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు రుజువు చేశారు. ఈ లిస్టులో తాజాగా మరొక డైరెక్టర్ కూడా చేరిపోయాడని తెలుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు గడ్ బై చెప్పి ప్రస్తుతం ఆయన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయనను రాజకీయ ప్రముఖులు కలిసి చర్చించడం చూస్తూనే ఉన్నాం.