ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు తిరగరాసింది. విడుదలైన అన్నిచోట్ల భారీ వసూలు సాధించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇతర భాషల్లో ఆకట్టుకున్న చిత్రంగా ‘పుష్ప’ నిలించింది. సుకుమార్ డైరెక్షన్, బన్నీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్పలో శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్ గా మారింది. అయితే పుష్ప-2లో శ్రీవల్లి పాత్రపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప-2 సినిమాలో శ్రీవల్లి చనిపోతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఖండించారు మూవీ మేకర్స్.
పుష్పలో శ్రీవల్లి పాత్రలో నటించి నేషనల్ క్రష్ గా మారింది కన్నడ బ్యూటీ రష్మిక. శ్రీవల్లిగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అయితే పుష్ప సెకండ్ పార్ట్ లో రష్మిక చనిపోతుందని టాక్ వినిపిస్తోంది. బన్నీపై పగ తీర్చకోవడం కోసం విలన్లు రష్మికను చంపుతారని టాక్. ఎమోషన్ కు పెద్ద పీట వేసే సుకుమార్ పుష్ప-2లో కూడా ఎమోషన్ కి పెద్ద పీట వేస్తున్నారంట. రష్మిక చనిపోవడమే పుష్ప-2 సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని సమాచారం. మరోవైపు అనసూయ, సునీల్ క్యారెక్టర్స్ రెండో భాగంలో మరింత బలంగా మారబోతున్నాయని.. ప్రతీకారం నేపథ్యంలో ఈ కథ ముందుకు వెళుతుందని తెలుస్తోంది.ఇలా సోషల్ మీడియాలో పుష్ప రెండో భాగం గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప-2పై వస్తున్న వార్తలను ఆ సినిమా నిర్మాత వై రవిశంకర్ ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వార్తలపై స్పందించారు.
పుష్ప మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ..”పుష్ప-2 లో శ్రీవల్లి పాత్రపై, సినిమాలో మరికొన్ని విషయాలపై వస్తున్న రూమర్స్ అంతా ట్రాష్, ఇప్పటి వరకు కూడా మేము కథను ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా వినలేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఈ సినిమా గురించి ఎవరికి ఏమి తెలియదు కాబట్టి వచ్చే రూమర్స్ ను ఈజీగా నమ్ముతారు. ఇవే వార్తలను వెబ్ సైట్ లు, టీవీ ఛానల్ కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా తప్పడు వార్తే” అని ఆయన తెలిపారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.