మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని స్టైలిష్ లుక్ లో చరణ్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఇక పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా RC15కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరో కాదు.. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. అవును.. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒకటి ఉందని.. సెకండాఫ్ లో కీలకమైన ఎపిసోడ్ లో వస్తుందని.. ఆ పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో నిజమెంత అనేది మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ సినిమాలో మోహన్ లాల్ అనే వార్త తెలియగానే మెగా ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. కాగా.. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ఓవైపు RC15 చేస్తూనే, మరోవైపు తదుపరి సినిమాలను లైనప్ చేసే పనిలో ఉన్నాడు. ఇక డైరెక్టర్ శంకర్ కూడా ఇటు RC15 తీస్తూనే, అటు కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్టైలిష్ రోల్ తో పాటు గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విలేజ్ గెటప్ కి సంబంధించి ఆ మధ్య పిక్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తున్నాడు. చూడాలి మరి చరణ్ సినిమాలో మోహన్ లాల్ కాంబో సెట్ అవుతుందేమో! మరి RC15పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.
#RC15 – New Zealand Schedule Wrap.. 💥#RamCharan #Shankar #DilRaju pic.twitter.com/1vtgSzmqU2
— VCD (@VCDtweets) November 30, 2022