రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థిని చిత్తు చేస్తేనే ముందుకుపోగలం. ఇలాంటి ఎత్తులు నాకు వెయ్యరాదని, అందుకే నేను రాజకీయాలకు పనికి రాను అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు మంచు మోహన్ బాబు. అదీకాక రాజకీయాల్లో నన్ను మోసం చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థిని చిత్తు చేస్తేనే ముందుకుపోగలం. లేకపోతే రాజకీయ సన్యాసం తప్పనిసరి. ఇక ఈ రాజకీయాల్లో అందరు ఇమడలేరు, అందుకే ఈ పాలిటిక్స్ కు దూరంగా ఉంటుంటారు. ఇలాంటి ఎత్తులు నాకు వెయ్యరాదని, అందుకే నేను రాజకీయాలకు పనికి రాను అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు మంచు మోహన్ బాబు. ఆదివారం (మార్చి19)న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ ఛానల్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కెరీర్లో ఎదుర్కొన్న చేదు సంఘటనలతో పాటుగా సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు కలెక్షన్ కింగ్. ప్రస్తుతం రాజకీయాలపై, భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నన్ను మోసం చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మోహన్ బాబు. మరి పాలిటిక్స్ లో మోహన్ బాబు ను మోసం చేసింది ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
మంచు మోహన్ బాబు.. తెలుగు చలన చిత్ర రంగంలో ఈ పేరుకు ఓ చరిత్రే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదిగి, ఓ దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయలపై తన ఆలోచనలను, ధృక్ఫథాన్ని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తానేందుకు పాలిటిక్స్ లోకిరాలేదో కూడా ఈ సందర్భంగా వెల్లడించారు మోహన్ బాబు. ‘ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మీకు ఏ సంఘటన ద్వారా రాజకీయాలపై విరక్తికలిగింది?’ అని జర్నలిస్టు ప్రభు ప్రశ్నించగా.. మోహన్ బాబు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
“ప్రస్తుతం అదంతా అప్రస్తుతం. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోను. గతం గతః. రాజకీయాల్లో నన్ను మోసం చేశారు. అయితే వాళ్లు మోసం చేశారు, వీళ్లు మోసం చేశారు అని నేను చెప్పను” అంటూ ఆన్సర్ ఇచ్చారు కలెక్షన్ కింగ్. ఇక అన్న ఎన్టీఆర్ ఆ కాలంలోనే నన్ను పాలిటిక్స్ లోకి రమ్మన్నారని, అయితే నా ముక్కుసూటి తనం రాజకీయాలకు పనికి రాదని నేను వెనక్కి తగ్గాను అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతే తప్ప నన్ను ఎవరూ వెనక్కి లాగలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరి రాజకీయాల్లో నన్ను మోసం చేశారు అన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.