కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జా ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. భర్త ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి, నటి మేఘన రాజ్ మానసికంగా కృంగిపోయారు. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుండి ఆమె కోలుకుని కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ షోస్‌లో కూడా నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మేఘనా రాజ్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో జోరున ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆ వార్తలకు ఆమె చెక్ పెట్టారు. తన భర్తపై ఉన్న ప్రేమకు ప్రతిరూపంగా ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. చేతి మణికట్టు మీద చిరు అని అడ్డంగా, రాయన్ అని నిలువుగా ట్యాటూ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆమె భర్తపై తనకి ఎంత ప్రేమ ఉందో తెలియజేశారు.
కాగా మేఘనా రాజ్ తెలుగులో అల్లరి నరేష్ నటించిన బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. అయితే కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జాను ఒక షూటింగ్‌లో కలుసుకున్న మేఘనా రాజ్ ఆయనతో ప్రేమలో పడ్డారు. పదేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత పెద్దల సమక్షంలో 2018 మే 2న వివాహం చేసుకున్నారు. మేఘనా రాజ్ గర్భవతిగా ఉన్న సమయంలో 2020 జూన్ 7న చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా మేఘనా రాజ్ జీవితం అంధకారంలోకి నెట్టేసినట్టు అయిపోయింది. అయితే కొన్ని రోజులకి తనకి రాయన్ జన్మించడంతో కొడుకు కోసం జీవించాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ ట్యాటూ ఫోటోలు షేర్ చేశారు. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ ద్వారా, రియాక్షన్ ఏంటో ఎమోజీ ద్వారా తెలియజేయండి.