బాలీవుడ్ నుండి వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ "బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ". తెలుగులో "బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ"గా రాబోతుంది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు ఈ మూవీపై మరింతగా అంచనాలు పెంచేందుకు చిత్ర బృందం మాస్టర్ ప్లాన్ వేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా పిలిచారు. తెలుగులో ఈ సినిమాకి భారీ హైప్ తీసుకురావాలంటే ఎన్టీఆరే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించింది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ను ఆహ్వానించింది. సెప్టెంబర్ 2న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ జరగనుందని, ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తారక్ వస్తున్నట్టు సోనీ మ్యూజిక్ ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. "సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో జరగనున్న బ్రహ్మాస్త్ర బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి.. ఇండియన్ సినిమా యొక్క మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ వస్తున్నారు" అంటూ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ఫర్ బ్రహ్మాస్త్ర అని ట్యాగ్ చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి బ్రహ్మాస్త్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మన అభిమాన ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తుండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. Gear up for a -! of Indian Cinema, @tarak9999 will be gracing the biggest pre-release event of ā as the chief guest on 2 in Hyderabad #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/x9ri3Ocjac — Sony Music India (@sonymusicindia) August 27, 2022 ఇది కూడా చదవండి: RRRలో పులి సీన్ మేకింగ్ వీడియో వైరల్! జక్కన్న డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఇది కూడా చదవండి: Liger 2 Days Collections: బాక్సాఫీస్‌పై లైగర్ పవర్ఫుల్ పంచులు.. రెండో రోజూ అదిరిపోయే కలెక్షన్స్!