సెలబ్రిటీలు “ఈ వేళలో ఏం చేస్తు ఉంటారో” అనుకుంటూ ఒకప్పుడు అభిమానులు పాటలు పాడుకునేవారు. ఇప్పుడు పాటలు పాడుకోవాల్సిన పని లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడంటే తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేశాక ప్రపంచం అంతా ఈ అరచేతిలోనే ఉంటుంది. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు.. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తిన్నారు ఇలా ప్రతీది అప్ డేట్ ఫోన్ లోకి వచ్చేస్తుంది. అంతా టెక్నాలజీ మాయ.
తాజాగా టాలీవుడ్ మెగా డాటర్స్, మెగా సిస్టర్స్ అయిన సుష్మిత, శ్రీజ, నిహారిక లేటెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు. అవే ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. కోట్లాది మెగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ఓ షోరూం ఓపెనింగ్ కు ఈ ముగ్గురూ హాజరయ్యారు. ఆ తర్వాత కలిసి లంచ్ చేశారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారికా.. ఈ లంచ్ కి సంబంధించిన లవ్లీ మూమెంట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను మెగా అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. ‘మహ ముద్దొచ్చేస్తున్నారు మెగా సిస్టర్స్’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్ తో నిహారికా డార్లింగ్ చంపేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగా సిస్టర్స్ లవ్లీ మూమెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Yash: ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటున్న యశ్ తనయుడు.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి: Jr NTR: భార్యకి ఖరీదైన ఫామ్ హౌస్ ని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్