భారత చలన చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ రికార్డు స్థాయిలో ఇండియన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా దెబ్బకి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక యష్ అయితే ఇండియన్ రాక్ స్టార్ అయిపోయారు. తర్వాత వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొటింది. నిజానికి కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2లు క్రైమ్ నేపధ్యం ఉన్న సినిమాలు. ఇందులో యష్ క్రైమ్స్ చేస్తుంటారు. అందుకే ఈ మూవీలో యష్ తనను తాను బ్యాడ్ బాయ్ అని చెప్పుకుంటారు. "ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్" అని ఓ సన్నివేశంలో డైలాగ్ కూడా చెప్తారు. అది సినిమా వరకే పరిమితం. బయట యష్ సూపర్ కూల్ పర్సన్ అండ్ చాలా మంచివారు. అయితే తన కొడుకు దృష్టిలో మాత్రం యష్ ఒక బ్యాడ్ బాయ్ అయిపోయారు. కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత బ్రేక్ తీసుకున్న యష్, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. కూతురు ఐరా, కొడుకు యథర్వ్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలను.. యష్ భార్య రాధికా పండిట్ ఇన్స్టాగ్రామ్ లో తరచూ షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా యష్ తనయుడు యథర్వ్ ముద్దుముద్దుగా మాట్లాడిన వీడియో ఒకటి షేర్ చేశారు. ఈ వీడియోలో యష్ తనయుడు ఏడుపు మొఖం పెట్టుకుని.. 'డాడీ బ్యాడ్ బాయ్' అంటున్నాడు. తనను యథర్వ్ బ్యాడ్ బాయ్ అంటుంటే.. లేదు గుడ్ బాయ్ అని కొడుకుతో యష్ వాదిస్తుంటారు. అయినా సరే యథర్వ్ ఏ మాత్రం తగ్గకుండా డాడీ బ్యాడ్ బాయ్ అని అంటూ ఉంటాడు. డాడీ గుడ్ బాయ్, స్వీట్ పర్సన్ అంటుంటే.. నో అని యథర్వ్ అంటూ ఉంటాడు. మరి మమ్మీ ఎలాంటిది అని అడగగా.. మమ్మీ గుడ్ గర్ల్ అని అంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. యథర్వ్ భలే క్యూట్ గా మాట్లాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ని కేజీఎఫ్ డైలాగ్ కి ఆపాదిస్తున్నారు. "ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్" అని యష్ చెప్పిన డైలాగ్.. యష్ పై రివర్స్ ఫైర్ అయ్యిందని అంటున్నారు. "నీ కొడుకు బ్యాడ్ అయితే డాడ్ గా మందలించాల్సింది పోయి కొడుకు విషయంలో బ్యాడ్ అయిపోయావా యష్ డాడ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏ తుంటరి పనో చేస్తే.. యష్ మందలించి ఉంటాడు. అందుకే యథర్వ్ యష్ ను బ్యాడ్ అంటున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి డాడీ బ్యాడ్ బాయ్ అంటున్న యష్ తనయుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) ఇది కూడా చదవండి: ఆ టైటిల్ ను రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనలో పడ్డ అనిల్ రావిపూడి! ఇది కూడా చదవండి: Jr NTR: భార్యకి ఖరీదైన ఫామ్ హౌస్ ని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్