Ponniyin Selvan: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చాలాకాలం తర్వాత ‘ పొన్నియన్ సెల్వన్’ అనే భారీ పీరియాడిక్ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
విడుదలకు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇటీవలే పోస్టర్స్ ద్వారా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన స్టార్ కాస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. అసలు మణిరత్నం సినిమా అంటేనే భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీ.. అందులోను విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, అతిథిరావు హైదరి, పార్తీబన్ ఇలా ఎంతోమంది స్టార్స్ కలిసిన నటిస్తున్నారు.
చోళ సామ్రాజ్యాధిపతుల విజయాలు, రాచరికపు కుట్రలు, కుతంత్రాలతో కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా పీరియాడికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ఆద్యంతం సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తోంది. టీజర్ లో స్టార్ కాస్ట్ అందరి లుక్ ని రివీల్ చేశారు మణిరత్నం. టీజర్ చూస్తుంటే విక్రమ్, ఐశ్వర్యరాయ్ ప్రధానపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
Pride of Kollywood #PonniyinSelvan !!❤️🔥🛐 #ChiyaanVikram pic.twitter.com/OgtbrOIDxM
— Dheera ツ 🦁 (@Dheera_Cvf) July 8, 2022
మణిరత్నం సినిమా అంటే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఉండాల్సిందే. ఈసారి కూడా చారిత్రాత్మక సినిమా ఫీలింగ్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పెంచేశాడు. విక్రమ్, త్రిష, ఐశ్వర్య, కార్తీ, జయం రవి.. ఇలా అందరూ తమ తమ కాస్ట్యూమ్స్ లో స్టన్నింగ్ అనిపిస్తున్నారు. ఒక నిమిషం నిడివి కలిగిన పొన్నియన్ సెల్వన్ టీజర్ లో ఆదిత్య కరికాలన్ చోళ సామ్రాజ్య యువరాజుగా విక్రమ్ డైలాగ్స్ హైలైట్ అవుతున్నాయి.
రవివర్మన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ నాటి పీరియాడిక్ కాలాన్ని తలపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. తాజా టీజర్ చూస్తుంటే.. ఇంత భారీ స్థాయిలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ మూవీ.. కోలీవుడ్ ఇండస్ట్రీకి ఓ బాహుబలి, కేజీఎఫ్ లా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి లెజెండ్ మణిరత్నం మ్యాజిక్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో. ఇక పొన్నియన్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.