'పొన్నియిన్ సెల్వన్' మూవీలో హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య.. టీమిండియా క్రికెటర్ ని ప్రేమించినట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా లక్కీ క్రికెటర్? ఏంటి సంగతి?
సాధారణంగా హీరోయిన్లు క్రికెటర్లని ప్రేమించిన పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. గతంలోనూ జరిగింది. ఇప్పటికీ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో చాలా అంటే చాలా ఫేమ్ తెచ్చుకున్నది అంటే విరాట్ కోహ్లీ-అనుష్కనే. సరే ఇది పక్కనబెడితే ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్య లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను కూడా టీమిండియా క్రికెటర్ ని ప్రేమించానని చెప్పింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరా క్రికెటర్? ఏంటా లవ్ స్టోరీ?
అసలు విషయానికొచ్చేస్తే.. సౌత్ హీరోయిన్లలో ఈ మధ్య కాలంలో అటు గ్లామర్, ఇటు యాక్టింగ్ తో పాపులారిటీ తెచ్చుకున్న భామ ఐశ్వర్య లక్ష్మీ. తెలుగులో ఇప్పటికే ‘గాడ్సే’, ‘అమ్ము’ సినిమాలు చేసింది గానీ ప్రేక్షకుల మైండ్ లో పెద్దగా రిజిస్టర్ కాలేదు. అయితే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకుంది.
‘నాకు టీమిండియా క్రికెటర్ యువరాజ్ అంటే చాలా ఇష్టం. ఆరో క్లాస్ నుంచి 12వ క్లాస్ చదవుతున్న టైమ్ లో అతడిని పిచ్చిగా ప్రేమించేదాన్ని. కానీ ఇప్పుడు క్రికెటర్ చూడటానికే టైమ్ అస్సలు దొరకడం లేదు.’ అని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే యువరాజ్ సింగ్ పెళ్లి చేసుకున్నది కూడా హెజిల్ కిచ్ అనే నటినే కావడం విశేషం. సో అదన్నమాట విషయం. ఐశ్వర్య, యువరాజ్ ని లవ్ చేసింది కానీ అది వన్ సైడ్ లవ్ అనమాట. మరి ఈమె చేసిన సినిమాల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం? కింద కామెంట్ చేయండి.