ఐశ్వర్య రాయ్ అంటే అందానికే అసూయ పుట్టేంత అందం ఆమె సొంతం. 50 పదుల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని రూపుతో.. అందంతో అందరిని మాయ చేస్తోంది. అందం ఐశ్యర్య దాసోహం అయ్యిందని చెప్పవచ్చు. అలాంటి ఐశ్వర్య ఎవరూ ఊహించని పని చేసి భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
భారతదేశ సినీ చరిత్రలో మణరత్నానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో క్లాసిక్ చిత్రాలు తెరకెక్కించాడు. కోలీవుడ్‌లోనే తెలుగు, బాలీవుడ్‌లో కూడా ఆయన సత్తా చాటాడు. నటీనటులు తమ జీవితంలో ఒక్కసారైన మణిరత్నం సినిమాలో నటించాలని.. చిన్న పాత్ర దొరికినా చాలని భావిస్తారు. ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నారు మణిరత్నం. ఇక తాజాగా ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా మొదటి భాగం గతేడాది విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఇక రెండో పార్ట్ పీఎస్-2 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష, శోభిత ధూళిపాళ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రం బృందం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం. ఇక ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా ముంబైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్.. వేదిక మీద.. మీడియా ముందు తన గురు, డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది.
ముంబైలో మంగళవారం జరిగిన ‘చోళ టూర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఐశ్వర్య.. మణిరత్నం పాదాలకు నమస్కరిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. గురువు పట్ల తన భక్తిని, గౌరవాన్ని ఇలా చాటుకుంది అంటూ ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటం పొందిన తర్వాత ఇరువర్ (తెలుగులో ఇద్దరు) చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. 1997లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు మణిరత్నం. అలా ఐశ్వర్య సినీ ప్రస్థానానికి కారకుడు, బాటలు వేసినవాడు మణిరత్నం.
ఆ తర్వాత కూడా ఐష్.. మణి డైరెక్షన్‌లో ‘గురు, రావణ్’ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’తో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. కాగా తన మొదటి సినిమా సహా కెరీర్‌లో పలు మెమరబుల్ చిత్రాలను అందించిన మణిరత్నంను గురువుగా భావించే ఐశ్వర్య.. ఆయనతో స్పెషల్ బాండింగ్ కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆయన పాదాలకు నమస్కరించి.. తన కృతజ్ఞత చాటుకుంది.
కాగా.. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో ఐశ్వర్య రాయ్.. పజువూరు యువరాణి నందిని పాత్రలో నటించింది. మొదటి పార్ట్ కంటే కూడా ఇందులో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండనుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. పొన్నియన్ సెల్వన్ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఐశ్వర్య రాయ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.