76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2023 వేడుకలు ఫ్రాన్స్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
సినిమా వేడుకలంటేనే చాలు తారలు చేసే సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్స్ ధరించే దుస్తులు, వారి నగలు, వారి కామెంట్లపైనే అందరి చూపులు ఉంటాయి. మీడియా, పపరజీలు తమ కెమెరాల్లో వారిని క్లిక్ మనిపించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక, 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2023 వేడుకలు ఫ్రాన్స్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న సినీ హీరోయిన్స్, సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై వారి అందచందాలతో హోయలు ఒలకబోస్తున్నారు. అయితే ఫ్రాన్స్‌లో జరగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ వెండి గౌనులో సందడి చేసింది. ఏ మూవీ వేడుకల్లోనైనా ఐశ్వర్య బచ్చన్ ప్రత్యేక కాస్టూమ్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.
వందల మంది ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోలు క్లిక్ మనిపించేందుకు రెడీగా ఉంటారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఈ సారి ఐశ్వర్య ధరించిన వెండి గౌను ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ పిచ్చి పీక్స్‌లో ఉంటుంది ఈ సినిమా వాళ్లకు. ఏం డ్రెస్సులు వేస్తారో ఏంటో..’’.. ‘‘ఐశ్వర్య నువ్వు నీ డిజైనర్‌ను మార్చు!’’.. ‘‘ వెండి డ్రెస్ కాదు.. అది విడ్డూరమైన డ్రెస్సు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఐశ్వర్య రాయ్ వెండి డ్రెస్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.