Manchu Vishnu: మంచు ఫ్యామిలీ నటులు ఎప్పుడు మాట్లాడతారా? ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు నెటిజన్లు. మంచు వారు మీడియా ముందుకొచ్చి మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వెంటనే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. తాజాగా మంచు విష్ణు, నిఖిల్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ వదిలారు. అంతే నెటిజన్లు మంచు విష్ణును విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కార్తికేయ 2 మూవీకి సంబంధించి థియేటర్లు దొరక్క హీరో నిఖిల్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. జనాలు కూడా నిఖిల్‌కి బాగానే సపోర్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మంచు విష్ణు ఒక ట్వీట్ చేశారు. “నా తమ్ముడు నిఖిలు, నేను ఎప్పుడూ ఉంటాను. స్ట్రాంగ్‌గా ఉండు. కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుంది. కార్తికేయ2 సినిమా కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీటేశారు. ఈ ట్వీట్‌పై నిఖిల్ స్పందిస్తూ “విష్ణు భాయ్ మీ మాటలు నాకు, కార్తికేయ2 మూవీ టీమ్‌కి పెద్ద భరోసా” అంటూ రిప్లై ఇచ్చారు. అది చూసిన నెటిజన్లు మాత్రం వరుస కామెంట్స్‌తో విష్ణును ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. “నీకే దిక్కు లేదు. నువ్వు ఒకరికి భరోసా ఇస్తున్నావ్. చిటికెలు.. చిటికెలు..” అని ఒకరు, “నువ్వు చెప్పడం తప్ప, చేయడం చేతకాదని.. ట్విట్టర్‌లో ట్వీట్స్ చేయడం తప్ప ఇంకేమీ చేతకాదని కొందరు.. ప్రెసిడెంట్ అయి ఉండి నిఖిల్‌కు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నావని” ఇలా రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.
మంచు విష్ణు ఏ మూవీ గురించి ట్వీట్ చేసినా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని, కార్తికేయ2 సినిమా కోసం చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయమని నెటిజన్లు కోరుకుంటున్నారు. మంచు విష్ణు సదుద్దేశంతోనే ట్వీట్ చేసినా ఎందుకో గానీ నెటిజన్లు విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు మంచు విష్ణు ఏం మాట్లాడినా మిస్ ఫైరవుతుంది. ఆయన మాట్లాడితే చాలు చాలా మందికి స్టఫ్ దొరుకుతుంది. పొలోమని వీడియోలు చేసేస్తారు. యూట్యూబ్‍లో మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు నిఖిల్‌కు సపోర్ట్ చేస్తూ మరోసారి ట్రోలర్స్‌కి స్టఫ్ ఇచ్చినట్టు అయ్యింది. మరి నిఖిల్‌కి ఒక ట్వీట్ ద్వారా సపోర్ట్ చేసిన మంచు విష్ణుపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Nike dhikkuledu…. Nuvvu Okariki barosa isthunnav ….. Chitikelu chitikelu 🤏🤏
— Vijay Kumar (@VijayKumar815) August 2, 2022