సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు మా అధ్యక్షులు మంచు విష్ణు. అయితే.. మా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మంచు విష్ణు సినిమా వార్తలకంటే రెగ్యులర్ గా కాంట్రవర్సీ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మా అసోసియేషన్ సభ్యుల కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ చెకప్ ద్వారా మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటుగా పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’ అసోసియేషన్ కి సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టిస్తానని మీడియా ముందే బహిరంగ ప్రకటన చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో హెల్త్ చెకప్స్ ప్రతి క్వార్టర్ కి ఓసారి, వివిధ హాస్పిటల్స్ లో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపాడు.
ఇక మా బిల్డింగ్, సినిమా టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతూ.. “నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే.. నా మేనిఫెస్టో 75% పూర్తీ చేశాను. మరో 6 నెలలలో ‘మా’ బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. ‘మా’ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. సినిమా టికెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని చాలామంది విమర్శించారు. ఇప్పుడేమో పెరిగిన టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. దీనిలో ఏది కరెక్ట్ అనేదానికి చర్చలు జరపాల్సి ఉంది. ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి, పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము” అని చెప్పాడు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మంచు విష్ణు వ్యాక్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.