తెలుగు బుల్లితెరపై ఆలీతో సరదా అనే ప్రోగ్రాం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రముఖ నటుడు ఆలీ ఈ ప్రోగ్రామ్‌లో సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారానికి ఒక సెలబ్రెటీ విషయాలు ప్రేక్షకులను తెలియజేసే ప్రయత్నం చేస్తాడ. అయితే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు నటుడు మంచు విష్ణు. ఇందులో పాల్గొన్న ఆయన కొన్ని కీలకమైన అంశాలు చెప్పుకొచ్చాడు.
ఇక అలీ విష్ణుని ఇలా అడుగుతూ…ఏంటీ మంచి మనోజ్‌కు నీకు పడ్డట్లేదంటా నిజమేనా అడగ్గానే..మంచు విష్ణు అయినా వాళ్లకు ఎందుకు చెప్పాలంటూ షో నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రోమోలో పూర్తిగా అర్దమవుతోంది. అలా అలీ ప్రశ్న అడిగిన వెంటనే విష్ణు సూట్ విప్పి బయటకు వెళ్తున్నట్లు ప్రోమోలో కనపడుతోంది. మరి నిజంగానే వీరిద్దరి మధ్య వివాదాలు, గొడవలు లాంటి ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విష్ణు చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు అభిమానులు స్పందిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో దిగ్గజ నటుడైన మంచు మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు, మనోజ్‌కు. వీరిద్దరికి పడటం లేదంటూ గత కొంత కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.