తరుచు వివాదాల్లో వేలు పెడుతూ సంచలనాలకు కేరాఫ్ గా ఉంటారు టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ పోరును తలపించిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష రేసులో నిలబడ్డారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు. ఇక అన్ని ఉత్కంఠలను తెర తీస్తూ చివరికి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు.
దీంతో ఒకరి ప్యానెల్ సభ్యులపై మరోకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మా ఎన్నికలను ఉద్దేశించి ఆర్జీవీ.. సిని ‘మా’ జోకర్లతో నిండిన సర్కస్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక వర్మ ట్విట్ కు స్పందించిన మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ వర్మకు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ.. అయితే అందులో మీరు రింగ్ మాస్టర్ సర్! అంటూ కాస్త చురక అంటించాడు. తాజాగా మంచు మనోజ్ చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. మంచు మనోజ్ వర్మకు ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021