మంచు కుటుంబం ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఇక మంచు లక్ష్మి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేయాలన్నా, ఆపదలో ఉన్న వాళ్లకి సాయం చేయడంలో అయినా, ట్రెండ్ కి తగ్గట్టు స్టైల్ ఐకాన్ గా ఉండడంలో అయినా హీరోయిన్స్ కంటే ముందు వరుసలో ఉంటారు. చేతలే కాదు మాటలు కూడా పవర్ ఫుల్ గానే ఉంటాయి. తాజాగా ఈమె ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒరిజినల్ రెజ్లింగ్ బెల్ట్ ఒకటి ధరించిన ఫోటోలను షేర్ చేశారు. “నా మిషన్ కేవలం మనుగడ సాధించడమే కాదు, అభివృద్ధి చెందడం కూడా. మరియు అలా చేయడానికి కొంత అభిరుచి, కొంత కరుణ, కొంత హాస్యం, కొంత స్టైల్ కలిగి ఉండాలి” అని ప్రముఖ అమెరికన్ రచయిత్రి మాయ ఏంజెలౌ సూక్తిని ట్వీట్ లో రాసుకొచ్చారు మంచు లక్ష్మి.
అంతేకాదు ఒరిజినల్ డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్ ధరించి.. విత్ ఒరిజినల్ బెల్ట్ అని రాసుకొచ్చారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ, రెజిల్ మ్యానియా, విమెన్ ఎంపవర్మెంట్, స్ట్రెంత్, పవర్ టు వుమన్ అని హ్యాష్ ట్యాగ్ లు కూడా పెట్టారు. ఈ పోస్ట్ తో మంచు లక్ష్మి తన లక్ష్యం ఏంటో వెల్లడించారు. తాను మనుగడ సాధించడమే కాదు, అభివృద్ధి చెందడం అని చెప్పుకొచ్చారు. అలానే మహిళా సాధికారికత గురించి సూటిగా సుత్తిలేకుండా చెప్పాలనుకున్నది చెప్పారు. మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలని, మనుగడ సాధించడం మాత్రమే కాదు.. మహిళలు అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి అన్న విషయాన్ని ఆమె ఈ పోస్ట్ తో చెప్పుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా ఇలానే పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో మంచు లక్ష్మి పట్టుకున్న రెజ్లింగ్ బెల్ట్ ను చూసి.. మేడమ్ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా? అని నెటిజన్స్ అడుగుతున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారని, క్యూట్ గా ఉన్నారని ఒకరు, వండర్ ఉమన్ అని ఒకరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మంచు లక్ష్మి రెజ్లింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒరిజినల్ రెజ్లింగ్ బెల్ట్ ఆమె దగ్గరకు ఎలా వచ్చిందో? అని నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు. ఏదైనా రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా లేదా వెబ్ సిరీస్ చేస్తున్నారా? అందులో మంచు లక్ష్మి రెజ్లర్ గా నటిస్తున్నారా? లేక నిజంగానే రెజ్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి మంచు లక్ష్మి విత్ రెజ్లింగ్ బెల్ట్ పై మీ అభిప్రాయమేంటి? కుస్తీ పోటీల్లో పాల్గొంటారా? లేక కుస్తీ పాత్రలో నటిస్తారా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి మేష్టారు.