ఈ రోజు(నవంబర్ 23) మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడిగానే కాకుండా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనదైనశైలిలో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు విష్ణు అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యాక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులలో విష్ణు పేరు మీద అన్నదానం చేయడం, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలు చేశారు. వాటిని షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ ప్రముఖులుకూడా విష్ణుకు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే విష్ణు అక్క మంచు లక్ష్మి మాత్రం డిఫరెంట్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
మంచు లక్ష్మి- విష్ణు రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ల బాండింగ్ అందరికీ తెలిసిందే. అక్క అంటే తమ్ముడికి.. తమ్ముడంటే అక్కకి ఎంతో ఇష్టం. ఎవరు ఏం చేసినా కూడా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పేందుకు మంచు లక్ష్మి ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షెఫ్ మంత్రా-2 షూటింగ్ సమయంలోది. దసరా సమయంలో విష్ణు- పాయల్ రాజ్‌పుత్ ఆ షోకి గెస్టులుగా వెళ్లారు. షూట్ మధ్యలో తమ్మడితో కలిసి ఫొటో దిగేందుకు మంచు లక్ష్మి ప్రయత్నించారు. ఆ సమయంలో విష్ణు ఫేస్ సరిగ్గా పెట్టుకో అంటూ కొట్టబోయి, బుగ్గ పట్టుకుంటారు.
చిన్న పిల్లాడు మారం చేస్తే ఎలా సముదాయిస్తారో అలాగే తన తమ్ముడిని మందలించిన ఆ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేశారు. “హ్యాపీ బర్త్ డే విష్ణు.. నీ కలలు అన్నీ సాకారం కావాలి. మనం ఏడాదికి కనీసం ఒక్క ఫొటో అయినా తీసుకోవాలి” అంటూ క్యాప్షన్ జతచేశారు. షూట్ మధ్యలో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మంచు లక్ష్మి షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే షెఫ్ మంత్రా- 2 అని ఆహాలో షో చేస్తున్నారు. ఇటీవలే బ్రహ్మానందం, ఆలీ షోకి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. షెఫ్ మంత్రా-2తో మొగిలి కిషోర్ అనే మరో యంగ్‌స్టర్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. కుకింగ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ఈ షోకి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది.