ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ నటులు. అందులో ఒకరు హీరో కాగా మరొకరు హీరోయిన్ కమ్ యాక్టర్ కమ్ నిర్మాత. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ లో స్టార్ హీరోహీరోయిన్స్ చాలామంది. ఇందులో వారసులుగా వచ్చి నిలదొక్కుకున్నవాళ్లు కొందరైతే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఫేమ్ తెచ్చుకున్నవాళ్లు మరికొందరు ఉంటారు. వీరందరిలో చాలా తక్కువమంది మాత్రమే ప్రతి ఏడాది వరసగా హిట్స్ కొడుతుంటారు. ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. కొంతమంది మాత్రం సినిమాల కంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటారు. వాళ్ల వరకు చాలా నార్మల్ గానే ఏదైనా విషయం అన్నప్పటికీ అది వేరేలా కన్వే అవుతూ ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిందంతా కూడా పైన కనిపిస్తున్న ఇద్దరు స్టార్స్ గురించే. మరి వాళ్లెవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ యాక్టర్స్ మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి గుర్తింపు తెచ్చుకున్న విష్ణు, లక్ష్మీప్రసన్న. 2020లో రక్షా బంధన్ సందర్భంగా ఈ ఫొటోని స్వయంగా విష్ణునే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడది అనుకోకుండా వైరల్ గా మారడంతో ఈ ఫొటోని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక వీళ్లద్దరి కెరీర్ గురించి మాట్లాడుకుంటే ‘విష్ణు’ సినిమాతో విష్ణు హీరోగా పరిచయమయ్యాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం తదితర చిత్రాలతో హిట్ కొట్టాడు. గతేడాది ‘జిన్నా’తో థియేటర్లలోకి వచ్చాడు గానీ ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.
నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో నటిగా మారింది. తొలి సినిమాతోనే అవార్డు కూడా సొంతం చేసుకుంది. గుండెల్లో గోదారి, దొంగాట, గుంటూరు టాకీస్, పిట్టకథలు, మాన్ స్టర్ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు చేసింది. ఇక ఈమె అమెరికన్ యాస వల్ల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అలానే తెలుగు హీరోయిన్స్ చాలామందికి ఈమె ఫ్రెండ్ కూడా. దీంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోన కనిపిస్తూ ఉంటుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. మంచు లక్ష్మీ-విష్ణు చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు. కింద కామెంట్ చేయండి.