A N D Prasad: మలయాళ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు వీపీ ఖలీద్ మృతి ఘటన మరువక ముందే మరో నటుడు కన్నుమూశారు. నటుడు ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చికి దగ్గర ఉన్న కలమస్సెర్రీలోని తన ఇంటి మందు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. జూన్ 25న సాయంత్రం ప్రసాద్ పిల్లలు తమ తండ్రి చెట్టుకు ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే పొరిగింటి వాళ్లకు ఈ విషయం చెప్పారు. వాళ్లు అక్కడికి వచ్చి ప్రసాద్‌ను చెట్టునుంచి కిందకు దించారు. అతడ్ని పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు తేలింది. కుటుంబ కలహాల కారణంగా నటుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఓ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ ప్రసాద్ గత కొన్ని రోజులనుంచి మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
కొన్ని నెలల నుంచి అతడి భార్య అతడికి దూరంగా ఉంటోంది. మరణానికి కొద్దిరోజుల ముందు నుంచి అతడు చాలా డిప్రెషన్‌లో ఉన్నట్లు తేలింది. ప్రసాద్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. అతడి వద్ద 2021లో సింథటిక్ డ్రగ్స్ దొరికాయి. సినిమాల్లోకి రాకముందు అతడిపై పలు కేసులు ఉన్నాయి.’’ అని తెలిపారు. కాగా, ప్రసాద్ చాలా మలయాళ సినిమాల్లో నటించారు. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కిన ‘యాక్షన్ హీరో బిజు’తో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి, ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kiran Abbavaram: తన సినిమా చూసేందుకు అభిమానికి టికెట్ డబ్బులిచ్చిన హీరో!