పరాయి భాషా హారోయిన్లకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. బీటౌన్ అమ్మాయిలకు,తమిళ, మలయాళ బ్యూటీలకు, కన్నడ కస్తూరీలకు టీ-టౌన్ రెడ్ కార్పెట్ పరస్తూ వస్తుంది. తెలుగు పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోయిన్లు అందరూ వేర్వేరు పరిశ్రమలకు చెందిన వారే
పరాయి భాషా హారోయిన్లకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. బీటౌన్ అమ్మాయిలకు, తమిళ, మలయాళ బ్యూటీలకు, కన్నడ కస్తూరీలకు టీ-టౌన్ రెడ్ కార్పెట్ పరస్తూ వస్తుంది. తెలుగు పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోయిన్లు అందరూ వేర్వేరు పరిశ్రమలకు చెందిన వారే కావడం గమనార్హం. సమంత, కాజోల్, తమన్నా, రకుల్, సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడిప్పుడు వస్తున్న అప్ కమింగ్ యాక్టర్స్ అంతా కూడా ఈ జాబితాలోని భామలే. ఇప్పుడిప్పుడే శోభిత, ఇషా, వైష్ణవి చైతన్య, శ్రీలీల వంటి తెలుగు హీరోయిన్లకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఒక్కసారైనా టాలీవుడ్‌లో కాలు మోపి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఊవిళ్లూరుతుంటారు ఇతర భాషా నటీమణులు.
అయితే కొంత మంది భామలు.. టాలీవుడ్ పరిశ్రమలోకి వస్తూ, వస్తూనే కుంభ స్థలాన్ని కొల్లగొట్టేస్తున్నారు. ఆ కోవకే వస్తుంది ఈ ఫోటోలోని చిన్నారి. ఇంతకు ఆ చిన్నారి ఎవరో తెలుసా.. మాళవిక మోహనన్. ఈ పేరు ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా.. టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఈ చిన్నది.. ఇప్పటికే తమిళ, మలయాళ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. మాస్టర్‌లో విజయ్ సరసన ఆడి పాడిన ఈ అమ్మడు.. బ్యాగ్రౌండ్ సినిమా పరిశ్రమకు చెందినదే. ఆమె తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్. మలయాళ, హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కేరళలో పుట్టినప్పటికీ ముంబయిలో పెరిగింది ఈ భామ. మాస్ మీడియాలో డిగ్రీ చేసిన ఆమె.. సినిమాటోగ్రఫీ మీద మక్కువతో తన తండ్రితో కలిసి యాడ్ షూట్స్ చేస్తూండేది. ఒక ఫెయిర్ నెస్ యాడ్ కోసం మమ్ముటితో కలిసి పనిచేస్తుంగా.. ఆమెకు నటనపై ఉన్న మక్కువతో తన కుమారుడు దుల్కర్ సల్మాన్ నటించబోతున్న సినిమా ద్వారా హీరోయిన్ అవకాశం ఇచ్చారు.
అలా 2013లో పట్టం పొలే అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ అవతారం ఎత్తింది మాళవిక. మలయాళ సినిమాలు చేస్తూ స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. రజనీకాంత్ పేటలో ఓ ముఖ్య పాత్రలో కనిపించిన అమ్మడిపై కోలీవుడ్ డైరెక్టర్ల కన్ను పడింది. మాస్టర్ సినిమాతో ఆమె పరోక్షంగా తెలుగు పరిచయమైంది. ఇప్పుడు విక్రమ్ తో కలిసి తాంగలన్ సినిమాలో నటిస్తుంది. అడపాదడపా హిందీ,కన్నడ సినిమాల్లోనూ కనిపించింది. తెలుగులో ఓ హీరోతో నటించే అవకాశమున్న వదులుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో (పరిశీలనలో రాయల్, అంబాసిడర్, డీలక్స్ రాజా) కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ అమ్మడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తాంగలన్ చిత్ర యూనిట్ ఓ ఫోటోను పోస్టు చేసింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటే ఈ బ్యూటీ.. హాట్ హాట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.