లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య మాళవిక మోహనన్.. పేరు ప్రస్తావించకుండా నయనతారను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది. దానికి నయనతార కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మాళవిక మరోసారి నయనతారను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. అవి తీవ్ర దుమారం లేపడంతో నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య మాళవిక మోహనన్.. పేరు ప్రస్తావించకుండా నయనతారను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది. దానికి నయనతార కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మరోసారి నయనతారను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. హీరోయిన్లను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం తనకు ఇష్టం లేదంటూ మాళవిక మోహనన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. పెట్ట, మాస్టర్, మారన్ వంటి సినిమాల్లో నటించిన మాళవిక మోహనన్ ప్రస్తుతం క్రిస్టీ అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది.
వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఒక మలయాళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ ఇంటర్వ్యూలో లేడీ సూపర్ స్టార్ బిరుదు ప్రస్తావన తీసుకొచ్చింది. ‘హీరోయిన్లను లేడీ సూపర్ స్టార్ అనడం ఏంటి? సూపర్ చాలు. కత్రినా కైఫ్, అలియా భట్, దీపికా పదుకొనె లాంటి వాళ్ళని లేడీ సూపర్ స్టార్స్ అని పిలవడం లేదు. వాళ్ళు సూపర్ స్టార్లు అంతే’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో మరోసారి మాళవిక తమ అభిమాన హీరోయిన్ ని టార్గెట్ చేసిందని నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతార మీద ఈర్ష్యతో బాలీవుడ్ హీరోయిన్స్ ని అడ్డుపెట్టుకుని నయనతార మీద పరోక్షంగా కామెంట్స్ చేసిందంటూ మండిపడుతున్నారు.
ఇండస్ట్రీలో నయనతార, మంజు వారియర్ లేడీ సూపర్ స్టార్స్ గా పిలిపించుకుంటున్నారు. సో నయనతార మీదే మాళవిక మోహనన్ తన అక్కసును వెళ్లగక్కిందని ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా నయనతార పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేసింది. ‘ఆమె ఒక సూపర్ స్టార్ హీరోయిన్. ఆమె ఒక హాస్పిటల్ సీన్ లో నటించింది. హాస్పిటల్ సీన్ లో మేకప్ వేసుకుని నటించడం ఏంటి? ఆ సీన్ లో చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంది, లిప్ స్టిక్ వేసుకుంది. కమర్షియల్ సినిమా అయినా లాజిక్ ఉండాలి కదా. లాజిక్ పోయింది’ అంటూ సెటైర్ వేసింది. దీనిపై నయనతార ఆ మధ్య స్పందించింది. కనెక్ట్ మూవీ ప్రమోషన్ లో నయనతార.. మాళవిక మోహనన్ కు రిప్లై ఇచ్చింది. పేరు ప్రస్తావించకుండా.. మాళవికకు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
‘అది కమర్షియల్ సినిమా. రియలిస్టిక్ సినిమాకి, కమర్షియల్ సినిమాకి తేడా ఉంది. రియలిస్టిక్ గా తీసినప్పుడు ఆ స్థాయికి వెళ్లి నటించాలి. కమర్షియల్ సినిమాలో అలా కాదు. హీరోయిన్ అందంపై ఆధారపడి ఉంటుంది’ అంటూ నయనతార జవాబిచ్చింది. అలా మొదలైన వీరి కోల్డ్ వార్.. మాళవిక చేసిన తాజా కామెంట్స్ తో మరింత పెరిగింది. హీరోయిన్స్ ని లేడీ సూపర్ స్టార్ అని అనాల్సిన పని లేదంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మాళవిక మోహనన్ స్పందించింది. హీరోయిన్స్ ని వర్ణించే పదం గురించే తప్ప పలానా వ్యక్తి గురించి ప్రత్యేకించి కామెంట్ చేయలేదు. నేను నిజంగా నయనతారను గౌరవిస్తాను, ఆరాధిస్తాను. ఒక సీనియర్ ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని నేను చూస్తున్నాను. నెటిజన్లు శాంతించండి. ముఖ్యంగా మీడియా వాళ్ళు’ అంటూ ట్వీట్ చేసింది. మరి దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.
Dont Call As Lady Super #MalavikaMohanan pic.twitter.com/OS3wTml8j4
— chettyrajubhai (@chettyrajubhai) February 11, 2023
My comment was about a term that is used to describe female actors & not about any specific actor. I really respect & admire Nayanthara, and as a senior really look upto her incredible journey. Can people please calm down. Especially the tabloid journos.
Only ♥️ to Miss N https://t.co/QyrfqOoJWU
— Christy (@MalavikaM_) February 12, 2023