ఈ మధ్యకాలంలో మనం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు చూస్తున్నాం. రియల్ స్టోరీలతో తెరకెక్కుతున్న బయోపిక్ సినిమాలను కూడా చూస్తున్నాం. తాజాగా ఓ రియల్ హీరో జీవితకథ ఆధారంగా రూపొందిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే.. జూన్ 3న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాను.. దేశంలోని ప్రధాన నగరాలలో ప్రివ్యూలు వేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలో తాజాగా వైజాగ్ లో మేజర్ ప్రీమియర్ షో ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రివ్యూ షో సంబంధించి పబ్లిక్ రివ్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అడివి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్ర పోషించడమే కాకుండా సినిమా రచనలో కూడా భాగమయ్యాడు. ఇక గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకుడు. జిఎంబి ఎంటర్టైన్ మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాళ కీలకపాత్రల్లో నటించారు.
మరి వైజాగ్ ప్రీమియర్ షోకి సంబంధించి మేజర్ సినిమా విశేషాలేంటో రివ్యూలో చూద్దాం! మేజర్ సినిమా కోసం ఎంత స్టడీ చేశారో.. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీలింగ్.. సోల్ కళ్ళముందు కనిపిస్తుంది. మేజర్ సందీప్ జీవితంలోని అన్ని అంశాలను టచ్ చేస్తూ సినిమాను రాసుకున్నారు మేకర్స్. ఫస్ట్ హాఫ్ లో మేజర్ సందీప్ చిన్నతనం, స్కూలింగ్, లవ్ స్టోరీలను చాలా మ్యూజికల్ గా చూపించారు. మిడ్ పాయింట్ లో వచ్చే సన్నివేశాలు, ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ స్టోరీలోకి తీసుకెళ్తాయి.
ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అనే ఆసక్తికరమైన పాయింట్ వద్ద ఇంటర్వెల్ ప్లాన్ చేశారు. జనరల్ గా ఫిక్షన్ స్టోరీ అయితే.. నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా వేసేందుకు మినిమం స్కోప్ లభిస్తుంది. కానీ రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి.. నెక్స్ట్ ఏంటనేది గెస్ చేయడం కష్టం. అందుకే సినిమాలోకి వెళ్తున్నకొద్దీ ఇంటరెస్ట్ పీక్స్ లోకి వెళ్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మనకు అన్ని ఫీలింగ్స్ ని ఒకేసారి కలిగిస్తాయి. కోపం, బాధ, ఉద్వేగం, భయం, టెన్షన్ ఇలా అన్నికోణాల్లో రచయితలు సక్సెస్ అయ్యారు.
ఇక క్లైమాక్స్ గురించి మాటలు సరిపోవు. క్లైమాక్స్ అంతా మేజర్ అనే అరుపులు, చప్పట్లతో థియేటర్లు నిండిపోతాయి. మేజర్ రోల్ కి అడివి శేష్ తన కెరీర్ లోనే ది బెస్ట్ ఇచ్చాడు. మేజర్ పేరెంట్స్ గా ప్రకాష్ రాజ్, రేవతి, హీరోయిన్ సయీ మంజ్రేకర్, మురళీశర్మ వందశాతం వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో ఇంపార్టెంట్ రోల్ లో శోభిత ధూళిపాళ అద్భుతమైన నటన కనబరిచింది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల పాటలు, నేపథ్య సంగీతం వెన్నెముక అనే చెప్పాలి. ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అబ్బూరి రవి మాటలు సినిమాకు మేజర్ ప్లస్. సినిమాకు కావాల్సింది రాబట్టుకోవడంలో దర్శకుడు శశికిరణ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొత్తానికి మేజర్ సినిమా మీకో సినిమాటిక్ ఎమోషనల్ లైఫ్ జర్నీని పరిచయం చేస్తుంది. మరి మేజర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.