తెలుగు సినిమా స్థాయి రోజురోజుకూ ప్రపంచదేశాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి. బాహుబలి 2 సినిమాలతో వేసిన బాటలో ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్, నార్త్ అన్ని భాషల సినిమాలు వెళ్తున్నాయి. ఏకంగా ఒక్కో భాష నుండి ఇండియన్ సినిమాలుగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే.. చిన్న యాడ్ ఏజెన్సీ, యూట్యూబ్ ఛానల్ నుండి ఇప్పుడు పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగిన ఇద్దరు యంగ్ ప్రొడ్యూసర్స్.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ ఎవరు? మహేష్ బాబు గురించి ఏం మాట్లాడారు? అనంటే.. వారే నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర. ఫస్ట్ షో అనే యాడ్ ఏజెన్సీతో కెరీర్ స్టార్ట్ చేసి.. ‘చాయ్ బిస్కెట్’ యూట్యూబ్ ఛానల్ తో క్రేజ్ సంపాదించుకున్నారు. కట్ చేస్తే.. ‘ఏ+ఎస్ మూవీస్’ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి.. ఏకంగా మేజర్ మూవీ నిర్మించారు. మహేష్ బాబుకి సంబంధించిన జిఎంబి ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి మేజర్ సినిమాని నిర్మించారు అనురాగ్, శరత్. అయితే.. వీరి నుండి ఇప్పుడు ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ మహేష్ బాబుతో పరిచయం, ఆయనతో జర్నీ గురించి షేర్ చేసుకున్నారు.
అనురాగ్, శరత్ మాట్లాడుతూ.. “మహేష్ బాబు గారి ‘1 నేనొక్కడినే’ మూవీ నుండి ప్రమోషన్స్ నుండి ట్రావెల్ చేస్తున్నాం. ఆయన మాతో ఎంతో జోవియల్ గా, సరదాగా ఉంటారు. మేజర్ సినిమా టైంలోనే మేం వాళ్ళ జిఎంబి సంస్థతో టైఅప్ అయ్యాం. అయితే.. మహేష్ బాబు ఇప్పుడు బిగ్ స్టార్. రాజమౌళితో సినిమా చేశాక ఆయన హాలీవుడ్ హీరో అయిపోతారు. ఆ ముక్క నేను రీసెంట్ గా చెప్పేశా. మీరు నెక్స్ట్ నుండి ఫిలిం నగర్ వదిలేసి హాలీవుడ్ లో సెటిల్ అయిపోండి సర్ అన్నాం. ఆయన నవ్వుతూ అంతేనంటావా అన్నారు. ప్రెజెంట్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మేజర్ టైంలో నమ్రత గారితో జర్నీ చేశాం.” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ నెట్టింట ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. సో.. మహేష్ – రాజమౌళిల ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.