సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా నంటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో విడుదల అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. మహేశ్ బాబు లుక్స్, డైలాగ్స్ పోకిరి సినిమాని గుర్తుచేస్తున్నాయంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శకులు సైతం మహేశ్ సినిమా చూసి మంచి మార్కులు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అదేంటంటే.. మహేశ్ సతీమణి నమ్రతా అందరితో కలిసి ఓ మాస్ థియేటర్ లో సినిమా చూశారు.
ఇదీ చదవండి: మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ!
నమ్రతా సాధారణంగా ఓ సాధారణ థియేటర్‌లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడటం ఇదే మొదటిసారంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అదే థియేటర్ లో డైరెక్టర్లు అనీల్ రావిపూడి, హరీశ్ శంకర్ సైతం దర్శనమిచ్చారు. నమ్రతా అందరితో మాట్లాడుతూ సందడి చేశారు. వీరితోపాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఫ్యాన్ షో చూశారు. ప్రస్తుతం ఫ్యాన్ షోలో నమ్రతా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమ్రతా ఫ్యాన్స్ తో పాటు సర్కారు వారి పాట సినిమా చూడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Super Star @urstrulyMahesh Wife #Namrata and Director @Anilravipudi At #SarkaruVaariPaata Fans Show#BlockbusterSarkaruVaariPaata #SVPMania #SVP #MaheshBabu #KeerthySuresh #ParasuramPetla #SumanTV pic.twitter.com/uHIblfkGa5
— SumanTV (@SumanTvOfficial) May 12, 2022