ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సినిమాలు చూసే, తీసే విషయంలో చాలా మార్పులొచ్చాయి. ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే దర్శకులు కూడా ఆ తరహా స్టోరీస్ తోనే వస్తున్నారు. ఇక ఇది కాదన్నట్లు పాన్ ఇండియా మూవీస్ కూడా గత మూడు నాలుగేళ్లలో బాగా పాపులర్ అయిపోయాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాలు అయినా ఉండాలి, లేదంటే పాన్ ఇండియా మూవీస్ అయినా అయ్యుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సరికొత్త అప్డేట్ వచ్చేసింది.
ఇక విషయానికొస్తే.. రాజమౌళిని అందరూ జక్కన్న అంటారు. ఎందుకంటే శిల్పాన్ని చెక్కినట్లు మూవీని కూడా అంతే ఫెర్ఫెక్ట్ గా చెక్కుతాడు కాబట్టి. ఇతడితో మూవీ అంటే మినిమం మూడు నాలుగేళ్లు పడుతుంది. ‘బాహుబలి’ రెండు సినిమాలకు అయితే ఏకంగా ఐదేళ్లకు పైనే టైం తీసుకున్నాడు. అయితే ఎన్నేళ్లు సమయం తీసుకున్నా సరే బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ ని ఫుల్ హ్యాపీ చేసేస్తాడు. అలా నాలుగేళ్ల పాటు తీసిన ఆర్ఆర్ఆర్.. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోకి వచ్చింది. మెగా-నందమూరి అభిమానులకు ఫుల్ కిక్కిచ్చింది. రూ.1200 కోట్లకుపైనే కలెక్షన్స్ సాధించింది.
ఇక దీని తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి పనిచేస్తానని రాజమౌళి దాదాపు రెండేళ్ల క్రితమే చెప్పేశాడు. కానీ ఇప్పటికీ అది ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. కానీ అప్పుడప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. రాజమౌళి తండ్రి, స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. అప్పుడప్పుడు మహేశ్-రాజమౌళి సినిమా గురించి చెబుతుంటారు. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతూ.. దీన్ని సినిమాగా కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామని అన్నారు. అంటే ఈ ప్రాజెక్టుకు సీక్వెల్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. లీడ్ రోల్స్ అలానే ఉంటాయని, కానీ కథా నేపథ్యం మారుతుందని అన్నారు. దీన్ని చూసిన మహేశ్ ఫ్యాన్స్.. ఫస్ట్ పార్ట్ కి ఇంకో నాలుగైదేళ్లు పట్టొచ్చు. అదే సీక్వెల్స్ అంటే ఈజీగా ఇంకో పదిహేనేళ్లు అయిపోతుందని నవ్వుతూ సైటెర్స్ వేస్తున్నారు. కొన్నాళ్ల ముందు ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సీక్వెల్ చేసే ఆలోచన ఉందని రాజమౌళి అన్నాడు. మరి చూడాలి ఇవి ఎప్పటికి థియేటర్లలోకి వస్తాయో? మరి పైన చెప్పిన దాని గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Superstar Mahesh Babu & Rajamouli’s Film is being developed as a franchise.
Sequels will Follow. While the story in these Sequels will change, the Central Characters will remain the same.
– Vijayendra Prasad Garu@urstrulyMahesh #SSMB29 pic.twitter.com/YGl7i4ywna— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) December 30, 2022