స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఆస్కార్ గెలిచి వచ్చిన వెంటనే మహేష్ ని మీట్ అయ్యాడు. వీళ్లిద్దరూ కలిసున్న పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఫుల్ జోష్ లో ఉన్నారు. గత సంవత్సరం నుంచి పూర్తిగా ‘ఆర్ఆర్ఆర్’తో సావాసం చేసిన ఈయన.. తను అనుకున్నది సాధించారు. తన సినిమాకు ఆస్కార్ సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్న అనుకున్న పని విజయవంతంగా పూర్తయిపోయింది. ఈ క్రమంలోనే మహేష్ తో చేయబోయే చిత్రంపై అప్పుడే అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో మహేష్-రాజమౌళి కొత్త ఫొటో ఒకటి బయటకొచ్చింది. అది కాస్త వెంటనే ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక విషయానికొస్తే.. టాలీవుడ్ సత్తా మనలో చాలామందికి తెలుసు. అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు. కానీ తెలుగు సినిమా టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం రాజమౌళి. ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న జక్కన్న.. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్ స్టార్ దర్శకులైన స్టీవ్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి వాళ్లే రాజమౌళిని మెచ్చుకున్నారు. తాజాగా ఆస్కార్ రావడంతో జక్కన్న క్రేజ్ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. దీంతో ఇతడి నెక్స్ట్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ బీభత్సంగా పెరిగిపోయాయి. అందులో మహేష్ హీరో కావడం సోషల్ మీడియాలో డిస్కషన్ కు కారణమైంది.
మహేష్ తో సినిమా చేస్తున్నానని రాజమౌళి.. లాక్ డౌన్ టైంలో అంటే రెండేళ్ల క్రితమే చెప్పేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బిజీ వల్ల అది లేట్ అవుతూ వచ్చింది. అమెరికా నుంచి అందరూ వచ్చేయడంతో రాజమౌళిని మహేష్ కలిశారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన ఓ పిక్ తాజాగా బయటకొచ్చింది. ఇందులో ఇద్దరూ చాలా కూల్ గా మాట్లాడుకుంటూ కనిపించారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయాలా అనే దాని గురించి మాట్లాడుకున్నారా లేదా నెక్స్ట్ ఆస్కార్ టార్గెట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరి రాజమౌళి-మహేష్ తాజా పిక్ లో వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
❤️🔥 #SSMB29 DUO❤️🔥@urstrulyMahesh @ssrajamouli #TeluguFilmNagar pic.twitter.com/lw1Wnbw5Tn
— Telugu FilmNagar (@telugufilmnagar) March 17, 2023