సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. కేక పుట్టించే లుక్ లో కనిపించి అంచనాలు పెంచేశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పగానే మనకు చాలావరకు సాఫ్ట్ సినిమాలే గుర్తొస్తాయి. గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే.. దాదాపు అన్ని మూవీస్ లోనూ.. ఇతడు చాలా సెటిల్డ్ గా ఉన్న రోల్స్ మాత్రమే చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా పడి చాలా కాలమే అయిపోయింది. ‘పోకిరి’ తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమా ఎప్పుడొస్తుందా? మహేష్ మాస్ గా ఎప్పుడు కనిపిస్తాడా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. త్వరలో ఆ డ్రీమ్ తీరిపోయేలా కనిపిస్తుంది. తాజాగా మహేష్, తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలే దానికి ఎగ్జాంపుల్ అనిపిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీని మెంటైన్ చేస్తుంటారు. పాటలు, ఫైట్స్ లో అప్పుడప్పుడు దాన్ని చూపిస్తూ ఉంటారు. మహేష్ కు మాత్రం ఆ విషయంలో చాలా మొహమాటమనే చెప్పాలి. అద్భుతమైన ఫిజిక్ ఉన్నాసరే దాన్ని పెద్దగా బయటపెట్టడు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో, అది కూడా తన ఇన్ స్టాలో ఫొటోస్ లో చూడటమే తప్పితే స్క్రీన్ పై ఫిజిక్ ని చూపించింది లేదు. ఇప్పుడు ఆ రూల్ ని బ్రేక్ చేసేలా మహేష్ కనిపిస్తున్నాడు.
తాజాగా జిమ్ లో బైసిప్స్ వర్కౌట్ చేసిన మహేష్.. నరాలు కనిపిస్తున్న తన బాడీ ఫొటోస్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇవి చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఫుల్ గా అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. దీనిలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఫుల్ గా యాక్షన్ ఉండబోతుందని తెలుస్తోంది. దీని తర్వాత రాజమౌళితో మహేష్ కలిసి పనిచేయనున్నాడు. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే యాక్షన్ అడ్వెంచర్ అని టాక్. ఇలా రెండు మూవీస్ కోసం పూర్తిగా కొత్త లుక్ లో మహేష్ కనిపించనున్నాడని.. ఈ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది. మరి మహేష్ లేటెస్ట్ ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.