సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి చిత్రబృందంతో పాటు మహేష్ కూడా తీరిక లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించగా.. కీర్తి సురేష్ మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో మహేష్ కి సంబంధించి ఓ సరదా వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ప్రమోషనల్ ప్రోగ్రామ్ కోసం సతీమణి నమ్రతతో హాజరైన మహేష్.. ఫోటోగ్రాఫర్ పై సరదాగా సెటైర్స్ వేశాడు.
సర్కారు వారి పాట సినిమాపై ఫ్యాన్స్ లో ఏ స్థాయి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ట్రైలర్ చూశాక, ట్రైలర్ లో మహేష్ మాస్ ఎనర్జీ చూశాక అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరవుతున్న మహేష్. ఫోటోగ్రాఫర్ తో.. “నువ్ ఆగవయ్యా రెండు నిమిషాలు.. రెస్ట్ కూడా లేదు. పద్దతి కూడా లేకుండా పోయింది. మూడు రోజుల నుండి ఏంటయ్యా ఇది” అంటూ సెటైర్స్ వేశాడు. ప్రస్తుతం మహేష్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.