ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. సినిమాలు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్.. ఇప్పటిదాకా వేల కుటుంబాలలో వెలుగు నింపారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్, నమ్రత దంపతులకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపాడు.
మంచి మనసున్న తెలుగు సెలబ్రిటీలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు ముందు వరుసలో ఉంటారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. సినిమాలు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్.. ఇప్పటిదాకా వేల కుటుంబాలలో వెలుగు నింపారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్, నమ్రత దంపతులకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపాడు. అంతేగాక మహేష్, నమ్రతల గురించి ఓ స్పెషల్ నోట్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు నాగవంశీ. ఇన్నేళ్ళైనా మహేష్ బాబు, నమ్రత ఎప్పుడు కూడా వారు సాయాన్ని బయటపెట్టలేదు. సాయం పొందినవారు చెప్పడం తప్ప.
తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్ నుండి సహాయం అంది కోలుకున్న చిన్నారి ఫోటోను షేర్ చేస్తూ.. నిర్మాత నాగవంశీ.. ‘కొన్నివారాల క్రితం నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు ఫోన్ చేసి ఓ చిన్నారికి అర్జెంట్ గా హార్ట్ సర్జరీ అవసరం ఉందని చెప్పారు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ ఫ్యామిలీకి సహాయం చేయాలని.. ఎలాగైనా ఈ విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ కి చేరేందుకు హెల్ప్ కోరారు. వారెప్పుడూ ఇలాంటి నిరుపేద ఫ్యామిలీస్, పిల్లలకు సహాయం చేయడానికి పాటుపడుతుంటారు. నేను వెంటనే ఈ విషయాన్నీ మహేష్ బాబు ఫౌండేషన్ కి చేరవేసి.. నమ్రత గారిని పర్సనల్ గా కలిసి చెప్పాను. ఆ తర్వాత ఆమెకు చిన్నారి ఫ్యామిలీ పూర్తి వివరాలు ఫార్వార్డ్ చేశాను. ఆమె వెంటనే స్పందించి.. ఆ చిన్నారికి హెల్ప్ చేయాలని ఫౌండేషన్ సిబ్బందికి సూచించారు’ ఇలా రాసుకొచ్చారు.
అదే నోట్ లో ఇంకా కంటిన్యూ చేస్తూ.. “రెండు వారాల తర్వాత సర్జరీ జరిగిన చిన్నారి ఫ్యామిలీ నుండి మెసేజ్ వచ్చింది. మహేష్ బాబు చేసిన మేలుకు వారు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. సర్జరీ తర్వాత కోలుకున్న చిన్నారిని చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఎన్నో వేల కుటుంబాల దీవెనలన్నీ మహేష్ బాబు ఫ్యామిలీపై ఉంటాయని, మహేష్ ఫ్యామిలీని చల్లగా ఉంచుతాయి. కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని ఎవరైనా దేవుడిగా భావిస్తారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ అలాంటి బాటలోనే నడుస్తోంది. మరోసారి మహేష్ తో పాటు నమ్రత గారికి థ్యాంక్యూ” అని చెప్పుకొచ్చాడు నాగవంశీ. దీంతో విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ నాగవంశీ నిర్మాణంలోనే మహేష్ ‘SSMB28’ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడైతే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఈ ఏడాది ఎండింగ్ లోపు రిలీజ్ కానుంది. మరి మహేష్ బాబు మంచి మనసు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
I’m grateful and thankful to @urstrulymahesh garu and Namrata garu for establishing @MBfoundationorg to cater to children’s needs 🙏
Happy to see the Kid Hale & Hearty after the surgery 💟 pic.twitter.com/JgMQrStysJ
— Naga Vamsi (@vamsi84) February 22, 2023