సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతమంది అభిమానులున్నారో.. ఆయన గారాల పట్టి, కుమార్తె సితారకు కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. పట్టుమని పదేళ్లు కూడా లేని సితూ పాప.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తనకంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్ ఉంది. గతంలో పలువురు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన చానెల్‌లో ఆ వీడియోలను పోస్ట్ చేసేది. ఇక సర్కారు వారి పాట మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పెన్నీ పెన్నీ సాంగ్ ప్రోమోలో సితార మెస్మరైజింగ్ స్టెప్స్ తో అలరించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ మీట్ తర్వాత మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ పిల్లలు సితార, గౌతమ్ హార్స్ రైడింగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: కుమార్తె డ్యాన్స్ చూసి మురిసిపోయిన మహేష్!సితార ఓ గుర్రపుశాలలో హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. ట్రైనర్స్ పర్యవేక్షణలో హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది సితార. గుర్రాన్ని పరుగులు పెట్టిస్తూ, మచ్చిక చేసుకుంటున్న సితార సాహసాలకు ఆమె అభిమానులు అబ్బుర పడుతున్నారు. ఇక మహేష్ కుమారుడు గౌతమ్ కూడా ఆ వీడియోలో ఉన్నాడు. సితార హార్స్ రైడింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం మహేష్ సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. జులై నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సితార హార్స్ రైడింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Mahesh Babu: తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసిన మహేష్ బాబు!