సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీఎత్తన స్పందన లభించింది. సినిమా ట్రైలర్, మ..మ..మహేసా సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారాయి. అవన్నీ సర్కారు వారి పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మహేశ్ లుక్, డైలాగ్ డెలివరీ, మేనరిజం విషయానికి వస్తే పోకిరి రోజులను గుర్తు చేస్తోంది. మహేశ్ బాబు కూడా పోకిరి ఫ్లేవర్ ఉంటుంది అనడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి ఎక్కువైంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో సముద్రఖని నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటనపై మహేశ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇదీ చదవండి: 100 రోజులుగా ఆస్ప్రతిలో ప్రియాంక చోప్రా కుమార్తె.. ఏమైందంటే!
ఒక నటుడిగా సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. రఘువరన్ బీటెక్ లో ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, అలా వైకుంఠపురములో ఒక స్ట్రాంగ్ విలన్ గా ఆయనలోని అన్ని షేడ్స్ చూశాం. యాక్టింగ్ పరంగా ఈ సనిమా కూడా సముద్ర ఖని కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని మహేశ్ కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా సినిమా షూటింగ్ ఎలా జరుగుతందో అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సమయంలో ఎంత ఇన్‌టెన్సిటీ షాట్ అయినా కూడా చూసే వాళ్లకు అర్థం కాదు. కానీ డబ్బింగ్, ఎడిటింగ్, బీజీఎం యాడ్ అయ్యాక మొత్తం ఫీల్ మారిపోతుంది. మహేశ్ బాబు కూడా సముద్రఖని విషయంలో అదే ఎక్స్ పీరియన్స్ అయ్యాడు.
డబ్బింగ్ సమయంలో సముద్రఖని యాక్టింగ్ చూసి తాను మెస్మరైజ్ అయినట్లు మహేశ్ తెలిపాడు. షూటింగ్ సమయంలో వారి మధ్య జరిగిన ఓ సంఘటనను మహేశ్ ప్రస్తావించాడు. ‘ఓ రోజు షూటింగ్ లో సముద్ర ఖని నా దగ్గరికి వచ్చి.. సార్ మీరు ఈ సినిమాలో చాలా కళ్లజోడ్లు వాడారు. నాకు కళ్లజోడ్లు అంటే చాలా ఇష్టం, మీరు వాడిన ఒక కళ్లజోడు ఇస్తే ఫ్రేమ్ కట్టించుకుంటా అని అడిగారు. డబ్బింగ్ సమయంలో ఆయన యాక్టింగ్ చూశాక.. ఒక కళ్లజోడు ఏంటి తీసుకెళ్లి ఒక కళ్లజోడ్ల షాపే కొనివ్వాలి అనిపించింది’ అంటూ మహేశ్ సముద్రఖనిని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.