పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన క్రేజీ ఫిలిం.. ‘బ్రో’ (ది అవతార్) థియేట్రికల్ ట్రైలర్‌కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన క్రేజీ ఫిలిం.. ‘బ్రో’ (ది అవతార్). యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్. జూలై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. శనివారం (జూలై 22) సాయంత్రం ‘బ్రో’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అభిరుచికి దగ్గరగా.. ఊహకందని విధంగా ఉంది ట్రైలర్. పవర్ స్టార్ స్టామినా ఏంటనేది మరోసారి బాక్సాఫీస్‌కి రుచి చూపించబోయే బొమ్మ ఇదని హింట్ ఇచ్చింది.
పవన్, తేజ్ మధ్య సీన్స్, పవన్ స్టైల్, స్వాగ్, డైలాగ్స్ అండ్ మేనరిజమ్స్ అన్నీ సాలిడ్‌గా సెట్ అయ్యాయి. పవర్ స్టార్‌ని ఈమధ్య కాలంలో స్క్రీన్ మీద ఇంత ఎనర్జిటిక్‌గా చూడలేదు. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి అలరించారు. తనను తాను టైంగా పరిచయం చేసుకున్నారాయన. ట్రైలర్ చివర్లో ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందంని తన స్టైల్లో ఇమిటేట్ చేసిన షాట్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ, ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తూ తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించారని అర్థమవుతుంది.
సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ఈ ట్రైలర్ వాటిని అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెంచేసింది. ట్రైలర్ చూసిన వారంతా ‘నో డౌట్, సూపర్ హిట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ విజువల్స్, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. 2 గంటల 17 నిమిషాల నిడివి ఉండే మూవీలో ఫస్ట్ పది నిమిషాల తప్ప మిగతా సినిమా అంతా పవన్ ఉంటారని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ ఇచ్చిన కిక్కుతో థియేటర్లలో సంబరాలు చేసుకోవడానికి ఫుల్ జోష్‌తో ఏర్పాట్లు చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.