జేకే భారవి.. భక్తి చిత్రాల రచయితగా తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణం పోశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విజవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఆయన జీవితం.. ఒక్క సినిమా దెబ్బకు పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి వచ్చేశారు. లగ్జరీ కార్లలో తిరగాల్సిన వ్యక్తి.. ప్రస్తుతం ఓలా బైక్ బుక్ చేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. కష్టాలు చుట్టుముట్టాయని.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాని తెలిపారు. తాజాగా ఆయనని సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. తన ఆర్థిక పరిస్థితి ఇలా అయిపోవడం వెనక గల కారణాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జగద్గురు ఆది శంకర సినిమాతో తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని తెలిపారు జేకే భారవి. ఇన్నేళ్లు తాను ఇండస్ట్రీలో సంపాదించినదంతా.. ఆ ఒక్క సినిమాతో పోయిందని తెలిపారు. అప్పటి వరకు అనుభవించిన వైభవం అంతా తారుమరయ్యిందని తెలిపారు. సినిమాల్లో సంపాదించినదంతా.. సినిమాల్లోనే పొగుట్టుకున్నాని అన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు గారు తనపై ఎంతో అభిమానాన్ని చూపుతారని.. తెలిపాడు. ఇప్పడు రాఘవేంద్ర రావు, నాగార్జునని కలిసి.. తన పరిస్థితి చెప్తే.. వాళ్లు తనకు సాయం చేస్తారని.. కానీ ఎవరి ముందు చేయి చాపడం తనకు ఇష్టం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.