తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు సంబంధించిన అన్ని ఎమోషన్స్ ని పండించగలిగే అతి కొద్ది మంది నటుల్లో దివంగత రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్న రియల్ హీరో శ్రీహరి. తన ఇంటి గుమ్మం తొక్కి అడిగిన వాడికి లేదనకుండా సాయం చేసే గొప్ప మానవతా వాది. కానీ ఇప్పుడు ఆయన సతీమణి డిస్కో శాంతి, పిల్లలు ఆర్థిక బాధలతో అల్లాడుతున్న పరిస్థితి. కొడుకుని ఫారెన్ లో చదివించాలన్నా స్థోమత లేని పరిస్థితి.
చిన్న చిన్న క్యారెక్టర్ ల స్థాయి నుంచి విలన్ గా అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అక్కడ నుంచి హీరోగా శ్రీహరి ఎదిగిన తీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న ఎంతోమందికి ఆదర్శం. భయాన్ని పుట్టించే విలన్ గా, కామెడీని పండించే కామెడీ విలన్ గా, విలన్ మీద తన ప్రతాపాన్ని చూపించే హీరోగా ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి.. స్వయంకృషితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హీరో తర్వాత తన సెకండ్ జర్నీలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ గా అద్భుతంగా నటించి ఎంతో మంది ప్రేక్షకులకు కుటుంబ కధానాయకుడుగా మారాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో హీరోయిన్ త్రిషకి అన్నయ్యగా నటించే క్యారెక్టర్ లో శ్రీహరి నట విశ్వరూపాన్ని ఈ రోజుకీ ఎవరూ మరిచిపోరు.
అలాగే బావగారు బాగున్నారా, ఆవిడ మా ఆవిడే, మగధీర, ఢీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో నటించి అశేష తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనా మాయాజాలంలో బందీ చేశారు. అసలు శ్రీహరి డైలాగ్ డెలివరీనే సూపర్ గా ఉంటుంది. అలాగే తెలంగాణ యాసకి సినిమాల్లో స్టార్ డంని తెచ్చిపెట్టింది శ్రీహరే. నటుడిగా ఫుల్ బిజీ గా ఉన్న టైం లోనే అనారోగ్య కారణాలతో శ్రీహరి చనిపోవడం జరిగింది. శ్రీహరి చావుకి హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యమే కారణమని శ్రీహరి భార్య డిస్కో శాంతి చెప్పడం కూడా జరిగింది. నేటికీ ఆవిడ అదే మాట అంటారు. శ్రీహరికి రాంగ్ ట్రీట్మెంట్ చేసారని పదే పదే చెప్తూనే ఉంటుంది. తాజాగా తను, తన పిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి డిస్కో శాంతి చేసిన కొన్ని కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యపరచడంతో పాటు వైరల్ కూడా అయ్యాయి.
తన భర్త శ్రీహరి చనిపోక ముందు చాలా డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని కానీ ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదని చెప్పింది. కానీ తాము డబులు ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ముక్కుపిండి తమ దగ్గర డబ్బులు వసూలు చేసి తీసుకెళ్లారని.. నగలు, పొలాలు, కార్లు అమ్మి బాకీలు తీర్చానని చెప్పింది. అప్పులు తీర్చడం కోసం చాలా ఆస్తులు అమ్మానని.. కారు ఈఎమ్ఐ కట్టకపోతే కారుని కూడా కంపెనీ వాళ్ళు కూడా తీసుకెళ్లారని చెప్పింది. డిస్కో శాంతి చెప్పిన ఈ విషయాల్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చాలా మంది శ్రీహరి ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వచ్చేదేంటా అని బాధపడుతున్నారు. అలాగే డబ్బులు లేవనే కారణంతోనే తన చిన్న కొడుకుని చదుకోవడానికి ఫారిన్ పంపించలేదని చెప్పింది.
ఇప్పుడు ఉంటున్న ఇంటి భాగంలో కొంచెం రోడ్ డివైడింగ్ లో పోతే ప్రభుత్వం నుంచి కొంత నష్టపరిహారం వచ్చిందని.. ఆ వచ్చిన డబ్బుని బ్యాంక్ లో డిపాజిట్ చేసానని.. అలాగే ఇంకో రెండు హౌసెస్ నుంచి కుడా రెంట్ వస్తుందని ఇంక ఇవే తనకు, తన పిల్లలకి ఆధారం అని చెప్పింది. సినిమాల్లో ఏమైనా ఆఫర్స్ వస్తే నటించడానికి సిద్ధం అని కూడా డిస్కో శాంతి చెప్పింది. చిన్న మొక్కగా ప్రారంభం అయిన శ్రీహరి ప్రస్థానం ఒక మహావృక్షంగా మారి ఎంతో మందికి నీడనిచ్చింది. కానీ ఇప్పుడు ఆయన కుటుంబం అలాంటి పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని శ్రీహరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బాధపడుతున్నారు.