లోకేష్ కనకరాజ్.. తమిళ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న యువదర్శకుడు. డెబ్యూ మూవీ నగరం నుండి ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా ఒకదాని వెనుక మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేశాడు లోకేష్. స్టార్ హీరోలైన కార్తీతో ‘ఖైదీ’.. దళపతి విజయ్ తో ‘మాస్టర్’.. విశ్వనటుడు కమల్ హాసన్, సూర్యలతో ‘విక్రమ్’ సినిమాలతో.. ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ని క్రియేట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. దీంతో స్టార్ అంతా లోకేష్ తో సినిమా చేయాలని క్యూ కడుతుండగా.. ఫ్యాన్స్ ఏమో నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఖైదీ, విక్రమ్ సినిమాలతో మొదలైన లోకి యూనివర్స్ లో ఇప్పటికే కార్తీ, కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ అంతా చేరారు. ఇక ప్రస్తుతం లోకేష్ దళపతి విజయ్ తో రెండో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ ని కూడా తన యూనివర్స్ లో యాడ్ చేయనున్నట్లు టాక్. కాగా.. విజయ్ సినిమా తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు చేయనున్నాడు. అయితే.. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సూర్య చేసిన ‘రోలెక్స్’ పాత్ర కూడా ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలలో అసలు రోలెక్స్ ఎవరు? డిల్లీ – విక్రమ్ ల లైఫ్ లో రోలెక్స్ ఎంట్రీ ఎలా జరిగింది? అనే విషయాలు తెలుస్తాయని ఇదివరకే డైరెక్టర్ లోకేష్ తెలిపాడు.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రోలెక్స్ క్యారెక్టర్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అవును.. తాజాగా లోకేష్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను దళపతి విజయ్ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత ఖైదీ 2.. విక్రమ్ 2 సినిమాలు చేసి.. సూర్య రోలెక్స్ క్యారెక్టర్ పై ఫుల్ లెన్త్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నాను” అని సర్ప్రైజ్ చేశాడు. దీంతో లోకేష్ మాటలకు సూర్య ఫ్యాన్స్ తో పాటు లోకి యూనివర్స్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే రోలెక్స్ క్యారెక్టర్.. సినిమా విజయంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇన్నాళ్లు సూర్యని హీరోగా పాజిటివ్ క్యారెక్టర్స్ లో చూసిన ఫ్యాన్స్ రోలెక్స్ పాత్ర చూసి థియేటర్స్ లో పండగ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ లో సూర్యని అంత వయోలెంట్ గా, క్రూయల్ గా చూపించాడు లోకేష్. రోలెక్స్ క్యారెక్టర్ తో ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేసిన విధానానికి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అంతలోనే లోకేష్ కనగరాజ్ రోలెక్స్ క్యారెక్టర్ తో పూర్తి సినిమా ఉంటుందని చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. విజయ్ 67, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు పూర్తయ్యేసరికే ఇంకో నాలుగేళ్లు పడుతుంది. సో.. అప్పటివరకూ లోకేష్ స్టోరీని రోలెక్స్ చుట్టూ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం లోకేష్ స్టేట్ మెంట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి రోలెక్స్ రోల్ ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#LokeshKanagaraj about upcoming LCU Projects ..🤩🔥 pic.twitter.com/jdJJHPqElW #LokeshKanagaraj #Thalapaathy67
— Karnataka Thalapathy Fan’s Club (@AbhishekCH9) December 13, 2022