ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. సుదీప్ తాను నటిస్తున్న సినిమాలను తెలుగులో కూడి రిలీజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుదీప్ నటించిన విక్రాంత్ రోణ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలోని రా రా రక్కమ్మ పాట.. మోత మోగిస్తోంది. సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమా జూలై 28న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రం బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ హైదరాబాద్, చెన్నై మీడియాకు క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాలు..
ప్రస్తుతం విక్రాంత్ రోణ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలతో టీం బిజీగా ఉంది. దీనిలో భాగంగా చెన్నై, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు ప్లాన్ చేశారు. అయితే అనుకోకుండా సుదీప్ అనారోగ్యానికిక గురవ్వడంతో.. ప్రెస్‌మీట్లు అన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుదీప్.. చెన్నై, హైదరాబాద్ మీడియాకు క్షమాపణలు చెప్పాడు. ‘‘అనారోగ్యం కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నాను. దీనివల్ల హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్‌లో ఈ రోజు జరగాల్సిన ప్రెస్‌మీట్స్ అన్నింటినీ రద్దు చేస్తున్నా. ఈ అసౌకర్యానికి చింతిస్తూ.. మీడియా మిత్రులందరికి క్షమాపణలు చెబుతున్నాను. కోలుకున్న వెంటనే.. ప్రెస్‌మీట్స్‌లో మళ్లీ పాల్గొంటాను. త్వరలోనే మీ అందరిని కలుస్తాను’’ అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు.
Apologies to all my media frnzz frm Chennai,Kochi & Hydarabad, for having canceled the press meet & event. I have Been Unwell. Feeling much better & shall resume travel again. IHoping to Reschedule to a sooner date.
Looking forward to meeting u all.
🥂
Love & Regards,
Kichcha❤️— Kichcha Sudeepa (@KicchaSudeep) July 21, 2022
విక్రాంత్ రోణ చిత్రం జూలై 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రం బృందం హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్‌లలో గురువారం ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని ప్లాన్ చేశాయి. కానీ సుదీప్ అనారోగ్యానికి గురి కావడంతో వాటిని రద్దు చేశారు. ఈ సందర్భంగానే సుదీప్ క్షమాపణలు చెప్పారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెం‍్టస్ రూపంలో తెలియజేయండి.