'ఈగ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితుడు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా నటిస్తున్న 'విక్రాంత్ రోణ' చిత్రం జూలై 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న సుదీప్.. కేజీయఫ్ 2 చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో హిందీ జాతీయ భాష కాదంటూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సుదీప్ పై నార్త్ ప్రజల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కౌంటర్ ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ "హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు అజయ్ దేవగన్. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 ఇది కూడా చదవండి: హిందీలో తెరకెక్కుతోన్న 25 సౌత్ ఇండియా సినిమాలు ఇవే! మరలా అజయ్ దేవగన్ ట్వీట్‌కు స్పందించిన సుదీప్.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు దీనిపై మీకు వివరణ ఇస్తాను. భారతదేశంలోని అన్ని భాషలపై నాకు గౌరవం ఉంది. మిమ్మల్ని బాధపెట్టడానికో, రెచ్చగొట్టడానికో.. ఇలా చేయలేదు. నేను ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నాను’ అంటూ సుదీప్ వరసగా ట్వీట్స్ చేశాడు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir https://t.co/w1jIugFid6 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 And sir @ajaydevgn ,, I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi. No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!! Don't we too belong to India sir. — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 దీనిపై క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నేను ఎప్పుడూ సినిమా పరిశ్రమను ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము అలానే ప్రతి ఒక్కరూ హిందీ భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.. దన్యవాదాలు అంటూ అజయ్ దేవగన్, సుదీప్ ట్వీట్‌కు మరోసారి రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ నెలకొంది. కాగా.. సుదీప్ "ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది. హిందీ ఇకపై జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. వాటిని ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అనుకున్నంతగా విజయం సాధించలేకపోతున్నాయి అని కామెంట్ చేశాడు. Hi @KicchaSudeep, You are a friend. thanks for clearing up the misunderstanding. I’ve always thought of the film industry as one. We respect all languages and we expect everyone to respect our language as well. Perhaps, something was lost in translation — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 ఇది కూడా చదవండి: ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ డైలాగ్ లీక్ చేసిన హరీష్ శంకర్