హీరో నాగచైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పటివరకు ఎంతమందికి ముద్దుపెట్టానో తెలియదని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
అక్కినేని హీరోల్లో నాగచైతన్య కాస్త డిఫరెంట్. ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఉంటాడు. రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలా త్వరలో ‘కస్టడీ’ అనే ద్విభాషా చిత్రంతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చైతూ.. తన గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాల్ని బయటపెడుతున్నాడు. ఇందులో భాగంగా ముద్దుల గురించి అదిరిపోయే కామెంట్స్ చేశాడు. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాల గురించి కాస్త పక్కనబెడితే హీరో నాగచైతన్య గత కొన్నాళ్ల నుంచి న్యూస్ లో ఉంటూ వస్తున్నాడు. దానికి రీజన్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. సమంతో విడాకుల తీసుకున్న తర్వాత చైతూ సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే శోభితతో డేటింగ్ లో ఉన్నాడంటూ గత కొన్నాళ్ల నుంచి న్యూస్ తెగ వైరల్ అయింది. అందుకు తగ్గట్లే కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ‘కస్టడీ’ రిలీజ్ సందర్భంగా ఆ టాపిక్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో నాగచైతన్య కామెంట్స్ కి వీటికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రతిదీ వైరల్ గా మారిపోయింది.
అలానే ‘కస్టడీ’ ప్రమోషన్ లో భాగంగా తమిళ యూట్యూబర్ వ్లాగ్ లో నాగచైతన్య పార్టిసిపేట్ చేశాడు. ఇందులో భాగంగా ‘ట్రూత్ ఆర్ డేర్’ గేమ్ ఆడారు. ‘ ఇప్పటివరకు ఎంతమందిని ముద్దుపెట్టుకున్నారు?’ అని చైతూని అడగ్గా.. ‘నేను ఎంతమందిని కిస్ చేశానో లెక్కేలేదు. ఎందుకంటే నా మూవీస్ లో చాలా కిస్ సీన్స్ ఉంటాయి. ఇప్పటివరకు వాటిని లెక్క పెట్టలేదు’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి చైతూ ముద్దు వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.