బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా 2004లో ప్రారంభమైన ‘కాఫీ విత్ కరణ్’ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుని, ప్రస్తుతం ఎడో సీజన్ నడుస్తోంది. సినిమాల పరంగా కరణ్ జోహార్ ఎంత పాపులర్ అయ్యారో తెలియాదు కానీ, ఈ షో ద్వారా మాత్రం మంచి పాపులారిటీ సంపాదించారు. అందులోనూ, ఈ షోను అభిమానించే వారి కంటే.. విమర్శించే వారే ఎక్కువ. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత కొన్నేళ్లుగా ఈ షోలో ద్వంద్వార్థాలతో పాటు, సెలబ్రిటీల బెడ్రూమ్ విషయాలు వంటి అంతరంగిక విషయాల ప్రస్తావన ఎక్కువగా వస్తుండటంతో ఈ షోపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కరణ్ జోహార్ మరో అడుగు ముందుకేసి.. ‘మీ అమ్మ, నువ్వింకా కన్యవనే అనుకుంటుందా..!’ అని కియారా అద్వానీని ప్రశ్నించారు. ఆ వివరాలు..
తాజాగా, ‘కాఫీ విత్ కరణ్ షో’ కు కియారా, షాహిద్ కపూర్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ సందర్బంగా వాళ్లిద్దరినీ సోఫాలో కూచోబెట్టిన కరణ్.. తన వాడివేడి ప్రశ్నలతో కియారాకు చెమటలు పట్టించాడు. ఏ సెలబ్రిటీ వచ్చినా వారి బెడ్రూమ్ విషయాలు లేదంటే రిలేషన్షిప్ గురించి మొహమాటం లేకుండా అడిగే కరణ్ జోహార్.. కియారా అద్వానీని కూడా అలానే ప్రశ్నించారు. ఈ క్రమంలో.. నువ్ బెడ్రూమ్లో దొంగా పోలీసు ఆటలు ఆడలేదా? అని అడిగాడు. ఈ ప్రశ్నను కాస్త ఇబ్బందిగా ఫీలయిన కియారా..’మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది’ అని బదులిచ్చింది.
అయినా వెనక్కు తగ్గని కరణ జోహార్.. అయితే ఏంటట? మీ అమ్మ నువ్వింకా కన్యవనే అనుకుంటుందా, ఏంటి? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. ‘నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా’ అని కియారా ఆన్సరిచ్చింది. ఈ ఎపిసోడ్ ఆగస్టు 25న విడుదల కానుంది. మరోవైపు.. ఈ షోకి విచ్చేసే బాలీవుడ్ సెలెబ్రిటీలపై నెటిజన్స్ ఛలోక్తులు పేలుస్తున్నారు. కాఫీ విత్ కరణ్‌కు అడల్ట్ షోగా ట్యాగ్‌లైన్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ షోపై, మీ అభిప్రాయాలను కామెంట్లను తెలియజేయండి.