యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో జరిగే విషయాల మీద కూడా తన వాణి వినిపిస్తా ఉంటారు. ఈ క్రమంలో ఆమెని విమర్శించే వారు విమర్శిస్తారు, ప్రశంసించేవారు ప్రశంసిస్తారు. అయితే ఆమె అవేమీ పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది స్ట్రెయిట్‌గా సుత్తి లేకుండా చెప్పేస్తారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు "ఒకరి బాధని చూసి సంతోషించను, కానీ కర్మ వెనక్కి వచ్చేస్తుంది" అని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేశారు. అయితే అనసూయ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవో అర్ధం కాక కొంతమంది నెటిజన్లు కొంచెం క్లారిటీ ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం లైగర్ సినిమా గురించి, విజయ్ దేవరకొండను ఉద్దేశించే కామెంట్స్ చేశారని అంటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో తల్లిని దూషించే డైలాగ్ తనకు నచ్చలేదని అనసూయ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా ఈ డైలాగ్‌ను యూత్‌తో అనిపించారు. ఈ విషయంలో అనసూయ విజయ్‌తో విబేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండ ప్రొడ్యూస్ చేసిన 'మీకు మాత్రమే చెప్తా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ ఫ్యాన్స్ అనసూయను మాట్లాడనివ్వలేదు. ఆ సమయంలో అనసూయ మొఖం చిన్నబుచ్చుకుంది. ఆమె కాస్త అసహనానికి గురయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్‌ని విజయ్‌ని ఉద్దేశించి చేసినదే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లైగర్ రిలీజ్ రోజునే ఇలా ట్వీట్ చేయడం, పైగా లైగర్‌కి కూడా నెగిటివ్ టాక్ రావడం.. చూస్తుంటే అనసూయ ట్వీట్ విజయ్‌ని ఉద్దేశించే అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె తన ట్వీట్‌లో పర్టిక్యులర్‌గా ఎవరి పేరు ప్రస్తావించలేదు. మరి అనసూయ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అనేది ఆమెనేరిటీ ఇవ్వాలి. మరి అనసూయ ట్వీట్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022