SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf Director Prashant Neel Life Story

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్! ఎవరీ ప్రశాంత్ నీల్?

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 19 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్! ఎవరీ ప్రశాంత్ నీల్?

KGF Director ‘Prashant Neel’ Biography in Telugu: విజయం ఎప్పుడైనా మధురమే. కానీ.., కొన్ని విజయాలు మాత్రం ఆనందంతో పాటు.. ఆశ్చర్యాన్ని కూడా తీసుకొస్తాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కె.జి.యఫ్ ఫ్రాంఛైజీది కూడా ఇలాంటి విజయమే. అప్పటి వరకు ఇండియన్ సినిమా చూడని ఓ సరికొత్త మేకింగ్ తో కె.జి.యఫ్‌ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గుండెలు పగిలేలా అరవాలి అనిపించే మాస్ ఎలివేషన్స్, హృదయాన్ని తడి చేసే సెంటిమెంట్.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎదిరించి, తానే ప్రపంచాన్ని శాసించేలా ఎదిగే హీరో క్యారెక్టరైజేషన్ వీటితో పాటు, సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత అవసరమో, ఎడిటింగ్ ఎక్కడ అవసరమో అనే పాఠాలు నేర్పిస్తూ.. కె.జి.యఫ్‌ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. కట్ చేస్తే.. 4 ఏళ్ళ తరువాత వచ్చిన కె.జి.యఫ్‌-2 ఇప్పుడు అంతకుమించిన సక్సెస్ అందుకుంది. ఒక్కసారి వస్తే అది విజయం. కానీ.., ఆ విజయం ప్రతిసారి వస్తే అది అద్భుతం. ఇంత అద్భుతానికి కారణమైన వ్యక్తి పేరు ప్రశాంత్ నీల్.

ఎవరీ ప్రశాంత్ నీల్:

ఎవరీ ప్రశాంత్ నీల్? ఒక్క మాటలో సమాధానం చెప్పడానికి అతని ప్రస్థానం సాధారణమైనది ఏమి కాదు. అలా అని 100 సినిమాల ప్రయాణము కాదు. ఇప్పటి వరకు తీసింది మూడే మూడు సినిమాలు. కానీ.., “అతని సినిమాల సంఖ్య చిన్నదే అయినా.. అతను అడుగు పెట్టాక కన్నడ సినీ ఇండస్ట్రీ మార్కెట్ పెద్దది అయ్యింది”.కర్ణాటక రాష్ట్రంలోని హసన్ ప్రాంతం ఇప్పుడు చాలా ఫేమస్. కె.జి.యఫ్‌ లోలా అక్కడ బంగారం దొరకదు. కానీ.. కె.జి.యఫ్‌ తెరకెక్కించిన దర్శక బంగారం ప్రశాంత్ నీల్ పుట్టింది అక్కడే. చిన్నప్పటి నుండి ప్రశాంత్ నీల్ దర్శకుడిని అయిపోవాలని కలలు కనలేదు. సినిమాలు అంటే పడి చచ్చేరకం అంతకన్నా కాదు. బుద్దిగా చదువుకున్నాడు.

“అంతా డబ్బు ఉంటే హాయిగా బతకొచ్చు అనుకుంటారు. కానీ.., డబ్బు లేకుంటే చావు కూడా ప్రశాంతంగా అవ్వదు” అని ప్రశాంత్ నీల్ అప్పుడే ఆలోచించాడు. అందుకే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే సినిమాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆ ఆసక్తితోనే ఫారిన్ లో డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాడు. అలా.. కన్నడ సినీ ఇండస్ట్రీ వైపు బయలు దేరాడు. ఆ సమయంలో “అతనికి వెళ్లే దారి గురించి తెలియదు. కాలం తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. కన్నడ సినీ ఇండస్ట్రీ మార్కెట్ ఎంత చిన్నదో కూడా తెలియదు”.

KGF director prashanth neel life story

మొదటి సినిమా:

అలా 2014లో తన బావమరిది శ్రీమురళీ హీరోగా ‘ఉగ్రమ్’ అనే సినిమాని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. “నేను రెడీ అంటూ”.. కన్నడ ఇండస్ట్రీకి తన రాకని తెలియజేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్న క్షణం అది. కానీ.., అడుగు దూరంలో లక్ష్యం ఉందనగా చుట్టూ చీకట్లు కమ్మాయి. సినిమా అంతా తీశాక.. విడుదలకి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అయితే.., అప్పటికే ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ గురించి కన్నడ ఇండస్ట్రీలో వార్తలు దావాలంలా వ్యాపించాయి. దీంతో.. నీల్ పై నమ్మకంతో కన్నడ స్టార్ హీరో దర్శన్.. ‘ఉగ్రమ్’ మూవీ విడుదలకి సహాయం చేశాడు. అలా అన్నీ సమస్యలను దాటుకుని 2014 ఫిబ్రవరి 21న ‘ఉగ్రమ్’ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. “విధి చేతి వాటం.. ఉగ్రమ్ విడుదలైన రోజు రెండు సంఘటనలు జరిగాయి. దర్శకుడిగాప్రశాంత్ నీల్ పుట్టాడు. అతని రాకతో కన్నడ సినీ ఇండస్ట్రీ మళ్ళీ కొత్తగా పుట్టింది”!

బాలీవుడ్ వైపు చూపు:

“ఊరు చూడటానికి వచ్చినోడు ఊరి గురించి తెలుసుకుంటాడు. ఊరిని ఏలటానికి వచ్చినోడు తన గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు”. ‘ఉగ్రమ్’ మూవీతో ప్రశాంత్ నీల్ అదే చేశాడు. తన గురించి కన్నడ ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన గురించి కన్నడ ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేశాడు. కొద్దిరోజులు కన్నడ బాక్సాఫీస్ వద్ద ‘ఉగ్రమ్’ జాతర జరిగింది. కేవలం తన రాకని తెలియజేయడానికి ప్రశాంత్ నీల్ తీసిన సినిమాని జనాలు విజిల్స్ వేసి హిట్ చేశారు. కానీ..,ఎప్పుడైతే శాంపిల్ గా తీసిన ‘ఉగ్రమ్’ మూవీ సూపర్ హిట్ అయ్యిందో.. అప్పుడే ప్రశాంత్ నీల్ కి కన్నడ ఇండస్ట్రీ ఓ చెరువు లా కనిపించింది. తనకి కావాల్సిన సముద్రాన్ని అందుకోవాలంటే ముంబైలో అడుగు పెట్టాలని ఆ క్షణమే అర్ధం చేసుకున్నాడు.

KGF director prashanth neel life story

“పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్”.. ప్రశాంత్ నీల్ ఈ సౌండింగ్ ముంబైకి వినిపించేలా చేయాలి అనుకున్నాడు. అలా జరగాలంటే.. ఓ మంచి కథ కావాలి. ఆ కథ గొప్పగా ఉండాలి. కానీ.., తొందర పడితే గొప్ప కథలు రాయలేరు. అలా అని ప్లాన్ చేసి గొప్ప కథలను బ్లూ ప్రింట్ తీయలేరు. దానికి కావాల్సినదల్లా ఓ చిన్న ఆలోచన. అయితే.., ఆరోజు ప్రశాంత్ నీల్ మెదడులో ఓ కారుచిచ్చే అంటుకుంది. ఆ విస్ఫోటనం పేరు “కె.జి.యఫ్‌”!

కె.జి.యఫ్‌ కోసం సాహసం:

కె.జి.యఫ్‌ అంటే.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. దక్షిణ కోలార్ జిల్లా హెడ్ క్వార్టర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రాబర్ట్‌ సన్‌ పేట తాలూకాలో ఈ గనులున్నాయి. ఈ గనుల వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రశాంత్ నీల్ ఆ చరిత్ర కథలను వింటూనే పెరిగాడు. అంతటి గొప్ప ప్రాంతం చుట్టూ కథ అల్లుతూ.. గొప్ప పాత్రలకి ప్రాణం పోశాడు. తనకి కావాల్సిన కథ సిద్ధమైంది. అప్పుడప్పుడే కన్నడ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న యష్ ను కె.జి.యఫ్‌ లో హీరోగా ఫైనల్ చేసుకున్నాడు. 2018 నాటికి కన్నడ సినీ ఇండస్ట్రీ హయ్యెస్ట్ గ్రాసర్ కేవలం 75 కోట్లు మాత్రమే. అలాంటిది కె.జి.యఫ్‌ మూవీ కోసం 80 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి. సినిమాని రూపాయల్లో కాకుండా.. మనసుతో, ప్రేమతో, ఇష్టంతో నిర్మించే నిర్మాత తప్ప ఇంకెవ్వరు ఈ సాహసం చేయలేరు. అలాంటి సమయంలో.. హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిర్గందూర్ ముందుకి వచ్చారు. కానీ.., అప్పుడు కేజీఎఫ్ టీమ్ ని చూసి అంతా నవ్వుకున్నారు. అయితే.. ఆ క్షణాన కన్నడ సినీ ఇండస్ట్రీలో ఇద్దరే ఇద్దరు బలంగా నిలబడి ఉన్నారు. ఒకరు ప్రశాంత్ నీల్. మరొకరు అతని విజన్ ని నమ్మిన యష్.

Is increase KGF ticket prices

రాజమౌళి సహాయం:

కె.జి.యఫ్‌ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రమోషన్ కావాలి. తమ వాయిస్ ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి, తమ సినిమా స్థాయిని అర్ధమయ్యేలా అందరికి చెప్పడానికి ఓ బలమైన గొంతు కావాలి. సరిగ్గా.. అలాంటి సమయంలో బాహుబలితో సౌత్ ఇండియా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పి, బాలీవుడ్ మేకర్స్ కు ఓ చిక్కు ప్రశ్నలా మారాడు రాజమౌళి. కె.జి.యఫ్‌ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి రాజమౌళినే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు ప్రశాంత్ నీల్, యష్. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఓరోజు రాజమౌళి ఎయిర్ పోర్ట్ లో వీరికి ఎదురు పడ్డాడు. యష్ ఆత్రుతుగా వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ మాటలు రాజమౌళి చెవులకి ఎక్కడం లేదు. ప్రశాంత్ నీల్ గురించి యష్ గొప్పగా చెప్తున్నాడు. రాజమౌళికి అవేమి వినే టైమ్ లేదు. సర్..మాది పాన్ ఇండియా మూవీ అన్నాడు యష్. అక్కడ ఆగిపోయాడు రాజమౌళి. జక్కన్నకి కావాల్సింది కూడా అదే. సౌత్ ఇండియన్ సినిమా బౌండరీస్ ని బద్దలు కొట్టాలి. నార్త్ డామినేషన్ ని పటాపంచలు చేయాలి. అదే రాజమౌలి కోరిక. ఆ కారణంగా కె.జి.యఫ్‌ విజువల్స్ చూడటానికి ఒప్పుకున్నాడు రాజమౌళి.

15 నిమిషాల సమయం. ల్యాప్ టాప్ లో కె.జి.యఫ్‌ యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తూ నీల్ ఏదో చెప్తున్నాడు. రాజమౌళికి ఆ మాటలు వినపడటం లేదు. అసలు ఆ మాటలు వినే స్థితిలో కూడా జక్కన్న లేదు. ఆ విజువల్స్ రాజమౌళిని బంధించేశాయి. అతను ఈ లోకంలో లేడు. అలానే ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తున్న క్షణంలోనే రాజమౌళికి అర్ధమైంది. కె.జి.యఫ్‌ అంటే బంగారం దొరికే స్థలం మాత్రమే కాదు. బంగారం లాంటి సినిమా కూడా అని. ఆ క్షణాన రాజమౌళి.. యష్ కోసమో, అక్కడ ఉన్న ప్రశాంత్ నీల్ కోసమో, తన ఆశయం కోసమో తెలియదు గాని.. కె.జి.యఫ్‌ ను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను వెళ్లిన ప్రతి చోటా కె.జి.యఫ్‌ గురించి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాడు రాజమౌళి.

Kgf

అలా.., 2018 డిశంబర్ 21న కె.జి.యఫ్‌ ప్రేక్షుకుల ముందకు వచ్చింది. సినిమా చూసిన వారంతా మౌనంగా ఉండిపోయారు. అద్భుతాన్ని ఆస్వాదించే సమయంలో మనిషిలో ఆవహించే ఓ నిశబ్ధత అది. తొలి వారం తరువాత అన్నీ వర్గాల ప్రేక్షకులకి కె.జి.యఫ్‌ స్థాయి అర్ధమైపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా కె.జి.యఫ్‌ ప్రభంజనం సృష్టించింది. అంతా.. కె.జి.యఫ్‌ మ్యానియా. అంతా కె.జి.యఫ్‌ మాయ. అంతలా కె.జి.యఫ్‌ సూపర్ హిట్ అయ్యింది. కన్నడ సినీ ఇండస్ట్రీ కలలో కూడా ఊహించని రేంజ్ లో కె.జి.యఫ్‌ చాప్టర్-1 రూ.250 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆ క్షణాన ప్రశాంత్ నీల్ ఇండియన్ సినీ మార్కెట్ లో.. సర్వము తననుకునే బాలీవుడ్ ని ప్రశ్నించి.. పిడుగులా గర్జించే ఒక ధీరుడులా కనిపించాడు.

కె.జి.యఫ్‌-2: 

జీవితంలో ఎదగడం కన్నా.. వచ్చిన ఎదుగుదలను నిలబెట్టుకోవడం కష్టం. కె.జి.యఫ్‌-1 తరువాత కె.జి.యఫ్‌-2 హిట్ కొట్టాలి. లేదంటే ఈ సక్సెస్ అంతా గాలివాటం అని చాలా మంది పెదవి విరుస్తారు. ఇందుకోసం 4 ఏళ్ళు కష్టపడ్డాడు ప్రశాంత్ నీల్. మధ్యలో ఎన్నోసార్లు సినిమా ఆగిపోయింది. కోవిడ్ కష్టాలు చుట్టుముట్టాయి. కానీ.., ఎన్ని అవరోధాలు వచ్చినా కె.జి.యఫ్‌ చాప్టర్ 2 కంప్లీట్ చేశాడు నీల్. విడుదల నాటికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 170 కోట్ల రూపాయల విలువ చేసే టికెట్స్ అడ్వాన్స్ గా బుక్ అయ్యే అంత అంచనాలు అవి. ఇన్ని అంచనాలను దాటుకుని కె.జి.యఫ్‌ సక్సెస్ చేయడం సాధ్యమా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ.., వారికి తెలియంది ఏమిటంటే? ప్రశాంత్ నీల్ అగ్గి లాంటోడు. ప్రేక్షకుల అంచనాలు పెట్రోల్. ఎక్స్‏పెక్టేషన్స్ ఎంత ఎక్కువ ఉంటే నీల్ సినిమా అంత ఎక్కువ మండుతుంది. ధగ ధగ ధగ.…!

KGF director prashanth neel life story

2022 ఏప్రిల్ 14న కెజిఎఫ్-2 ప్రేక్షకుల ముందుకి వచ్చి, ఇండియన్ సినిమా రికార్డ్స్ కొల్లగొడుతుంది. ఇది ప్రశాంత్ నీల్ ప్రస్థానం. అయితే.. నీల్ ప్రయాణంలో ఇదంతా మొదటి అధ్యాయం మాత్రమే. అసలు జర్నీ ఇకపై మొదలు కాబోతుంది. మొత్తంగా.. సూత్రదారుడి సూత్రాన్ని చెరిపి.. సౌత్ ఇండియా సినిమాలను చిన్న చూపు చూసే బాలీవుడ్ అహంకారాన్ని అంతం చేయడానికి వచ్చిన దొరని, ధీరులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చిన కన్నడ ఇండస్ట్రీకి హ్యాట్సాఫ్. ప్రశాంత్ నీల్ కి హ్యాట్సాఫ్. మరి.. ప్రశాంత్ నీల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • KGF 1
  • KGF Chapter 2
  • latest tollywood news
  • life story
  • Prashant Neel
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

  • నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

    నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Devara movie: ఎన్టీఆర్ ‘దేవర’లో కేజీఎఫ్ నటుడు.. అలాంటి రోల్ కోసం!

    Devara movie: ఎన్టీఆర్ ‘దేవర’లో కేజీఎఫ్ నటుడు.. అలాంటి రోల్ కోసం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam