దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. గతంలో ఉన్న పరిధి, అడ్డంకులు దాటుకుని ప్రతి సినిమాని అన్ని భాషల్లో విడుదల చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలను చేరువ చేస్తున్నారు. అటు ప్రేక్షకులు సైతం కథ, కథనం బాగుంటే హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా నీరాజనాలు పడుతున్నారు. అందుకు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్క వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 719కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంటేనే అర్థమవుతోంది. పాన్ ఇండియా సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందనేది. అంతా బాగానే ఉందిగానీ, ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఎఫెక్ట్ పుష్ప 2పై పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం! స్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్!
పుష్ప సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఎక్కడ పట్టినా పుష్ప సినిమా గురించే టాక్. సెలబ్రిటీలు, క్రికెటర్స్, రాజకీయనాయకులు సైతం పుష్ప డైలాగులు వల్లె వేయడం మొదలు పెట్టేశారు. అయితే ఆ అంచనాలతో పుష్ప పార్ట్ 2 విషయంలో సుకుమార్ కు మరింత బాధ్యత పెరిగింది. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలో ఉన్న ఎలివేషన్స్, ఆ సినిమాకు బాలీవుడ్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి సుకుమార్ మళ్లీ ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. పార్ట్ 2 కథలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నాడంట.
మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ కు కథ పరంగా ఎలివేషన్స్ ఉన్నాయి గానీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయలేదు. అయితే ఇప్పుడు హీరోయిజం పరంగానూ ఎక్కువ ఎలివేషన్స్, హైప్ ఇచ్చే సన్నివేశాలను రాసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో పుష్పరాజ్ ను చూసి ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. పార్ట్ 1లో స్మగ్లింగ్ సిండికేట్ హెడ్ గా ఎదిగిన పుష్పరాజ్ కు మంచి ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు. దానిపై సుకుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ మరోసారి ‘మే జుకుంగా నహీ’ అంటూ చొక్కాలు చించుకోవాల్సిందే అనమాట. కేజీఎఫ్ ఛాప్టర్ 2తో పుష్ప పార్ట్ 2పై అంచనాలు పెరిగాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Big congratulations to KGF2 . Swagger performance & intensity by @TheNameIsYash garu. Magnetic presence by @duttsanjay ji @TandonRaveena ji @SrinidhiShetty7 & all actors. Outstanding BGscore & excellent visuals by @RaviBasrur @bhuvangowda84 garu . My Respect to all technicians.
— Allu Arjun (@alluarjun) April 22, 2022
A spectacular show by @prashanth_neel garu. My respect to his vision and conviction. Thank you all for a cinematic experience & keeping the Indian cinema flag flying high. #KGF2
— Allu Arjun (@alluarjun) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.