ఎక్కడ చూసినా కేజీఎఫ్ ఛాప్టర్ 2 మేనియా కనిపిస్తోంది. థియేటర్లు మొత్తం రాఖీ భాయ్ పేరు మారుమ్రోగుతోంది. ప్రశాంత్ నీల్ విజువల్ వండర్.. ఎలివేషన్ కా బాప్ లా ఉన్న కేజీఎఫ్ ఛాప్టర్ 2ని చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అంతా రాఖీ అభిమానులుగా మారిపోయారు. బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాగా కేజీఎఫ్ 2 అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టింది. బాలీవుడ్‌లో ట్రిపులార్ సహా హిందీ సినిమాలను వెనక్కినెట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఇదీ చదవండి : KGF 1,2,3 కాదు.. మొత్తం 12 చాప్టర్లంటా!
అటు అమెరికాలో ఫస్ట్ డేలో 1 మిలియన్ కలెక్ట్ చేసిన తొలి కన్నడ సినిమాగా రికార్డులకెక్కింది. ఇంక కర్ణాటక, కేరళలో కూడా డే వన్ హైఎస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. రాఖీ భాయ్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. అటు తెలుగునాట కూడా కేజీఎఫ్ మేనియా నడుస్తోంది. ఇక్కడ కూడా బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే అని తెలుస్తోంది. తెలంగాణలో అయితే ఏకంగా బాహుబలి 2 డే వన్ కలెక్షన్స్ ను బీట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే.. ఇంక కేజీఎఫ్ 2కి తెలుగురాష్ట్రాల్లో కూడా ఎదురుండదనే చెప్పాలి. ఏప్రిల్ 29 ఆచార్య రిలీజ్ వరకు తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2కి ఎదురుండదనే చెప్పాలి. చూడాలి ఇంక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.